క్రీడాభూమి

పాయింట్ దూరంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, అక్టోబర్ 14: అంతర్జా తీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. రెం డో టెస్టులో డబుల్ సెంచరీ సాధించి, జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించి న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి టెస్టుల్లో నెంబర్ 1 ర్యాంకు సాధించేందకు పాయింట్ దూరంలో నిలిచాడు. ప్రస్తుతం 937 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ మొదటి స్థానంలో ఉండగా, 936 పాయంట్లతో కోహ్లీ రెండో స్థా నంలో కొనసాగుతున్నాడు. ఇక టా ప్-10 బ్యాట్స్‌మెన్ల జాబితాలో టెస్టు స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా 817 పాయంట్లతో 4వ స్థానంలో నిలవగా, వైప్ కెప్టెన్ అజింక్యా రహానే 721 పాయింట్లతో 9వ స్థానాన్ని దక్కించు కున్నాడు. దక్షిణాఫ్రికా నుంచి క్వింటన్ డికాక్‌కు మాత్రమే టాప్ 10లో చోటు దక్కింది. ఇదిలాఉంటే బౌలింగ్ విభా గంలో చాలారోజుల తర్వాత రవిచం ద్రన్ అశ్విన్ టాప్ 10లో చోటు దక్కిం చుకున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అద్భుతంగా రాణించిన అశ్విన్ 7వ స్థానంలో కొనసాగుతుండగా, ప్రపం చకప్ తర్వాత టెస్టుల్లో విశ్రాంతి తీసు కున్న పేసర్ జస్ప్రీత్ బుమ్రా 818 పాయింట్లతో మూడో స్థానంతో సరిపె ట్టుకున్నాడు. ఇక సఫారీ పేసర్ కగిసో రబడ 835 రేటింగ్ పాయంట్లతో రెండో స్థానంలో నిలవగా, 791 పా యంట్లతో వెర్నర్ ఫిలాండర్ 8వ స్థానంలో ఉండగా, టాప్‌లో 908 పాయింట్లతో ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ కొనసాగుతున్నాడు. మరోవె పు ఇంకా ఓ టెస్టు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా టెస్టు చాంపియన్‌షిప్‌లో 200 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న విషయం తెలిసిందే.
*చిత్రం...విరాట్ కోహ్లీ