క్రీడాభూమి

కెప్టెన్ నుంచి అధ్యక్షుడిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, అక్టోబర్ 14: 1989లో బెంగాల్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన సౌరవ్ గంగూలీ 1992లో భారత్ తరఫున బ్రిస్బేన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంగేట్రం చేశాడు. అయతే తొలి మ్యాచ్ లో కేవలం 3 పరుగులతోనే నిరాశ పరిచిన దాదాపై అహంకారిగా ముద్ర పడింది. ఆ తర్వాత జట్టులో చోటు కూడా దక్కలేదు. పట్టువ దలని విక్రమార్కుడిలా రంజీల్లో రాణించాడు. నాలుగేళ్లలోనే తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. 1996లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఆరంగేట్రం చేసిన సౌరవ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయంది. మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం టీమిండియాను ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా 2000లో మొదటిసారి కెప్టెన్‌గా గంగూలీ బాధ్యతలు స్వీకరించాడు. అప్పటికీ దూకుడు అంటే ఎలా ఉంటుందో, విదేశాల్లో గెలుపు రుచిని చూపించి జట్టుకు వనె్న తెచ్చాడీ బెంగాల్ టైగర్. అనూహ్యా పరిస్థితుల నడుమ 2005-06 కాలంలో ఏరికోరి గ్రేగ్ చాపెల్‌ను కోచ్‌గా రప్పించుకున్న దాదా, అతడి కారణంగానే కొద్దిరోజులు ఆటకు దూరమయ్యాడు. కొద్దికాలంలోనే తిరిగి జట్టులోకి వచ్చి రాణించాడు. అయతే అప్పటికే కొన్ని కారణాలు, వయసు రీత్యా అంతర్జాతీయ క్రికెట్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. భారత్ క్రికెట్ చరిత్రలో అప్పటితరం కెప్టెన్లలో గంగూలీది మొదటి స్థానం. క్రికెట్‌కు దూరమైన గంగూలీ క్యాబ్ (క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్) అధ్యక్షుడిగా కొనసాగాడు. ఈ నెల 26న బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నాడు.

*చిత్రం...టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ