క్రీడాభూమి

బాక్సింగ్ బౌట్‌లో పోయిన మరో ప్రాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో, అక్టోబర్ 17: బాక్సింగ్ బౌట్‌లో మరో ప్రాణం పోయంది. గత జూలైలోనే రోజుల వ్యవధిలో ఇద్ద రు బాక్సర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ప్రత్యర్థ్థి పంచ్‌లకు తట్టుకోలేక అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్ పాట్రిక్ డే ప్రాణాలు విడిచా డు. బాక్సింగ్ బౌట్‌లో తలకు తీవ్ర గా యాలవడంతో నాలుగు రోజుల పా టు కోమాలో ఉన్న పాట్రిక్ మృతి చెం దాడు. శనివారం చికాగోలో జూనియ ర్ మిడిల్ వెయట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా చార్లెస్ కాన్‌వెల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాట్రిక్ నాకౌట్ అయ్యా డు. చార్లెస్ నుంచి వచ్చిన బలమైన పంచ్‌లకు రింగ్‌లో నిలబడలేక పాట్రి క్ అక్కడే కూలబడిపోయాడు. దీంతో వెంటనే అతడిని ఆస్ప్రతికి తరలించి చికిత్స అందించా రు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో పాట్రిక్‌ను బతి కించడం కోసం చేసిన వైద్యులు చేసి న ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన పాట్రిక్ బుధ వారం మృతి చెందినట్లు అతడి ప్రమో టర్ డిబెల్లా ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
*చిత్రాలు.. చార్లెస్ కాన్‌వెల్‌తో తలపడుతున్న పాట్రిక్ డే (ఎడమ)

*బౌట్‌లో గాయపడిన పాట్రిక్ డే ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం