క్రీడాభూమి

కోహ్లీకి విశ్రాంతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: బంగ్లాదేశ్‌తో జరిగే టీ-20 సిరీస్ నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకూ భారత్ ఆడిన 56 మ్యాచ్‌లకుగాను అతను 48 మ్యాచ్‌లు ఆడాడు. అవిశ్రాంతంగా క్రికెట్ ఆడడం వల్ల తలెత్తే ఇబ్బందులకు గురవుతున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అనుకుంటున్నట్టు సమాచారం. అందుకే, ఈనెల 24న జరిగే జట్టు ఎంపికలో అతని పేరును ప్రస్తావించకపోవచ్చని తెలుస్తోంటది. అయితే, ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత, కోహ్లీతో చర్చించిన తర్వాతే జాతీయ సెలక్షన్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ వర్గాలు పీటీఐకి తెలిపాయి. కోహ్లీ విశ్రాంతిని కోరతాడా? లేదా? అనే విషయాన్ని కూడా సెల్టర్లు అతని ద్వారానే తెలుసుకుంటారని ఈ వర్గాలు వెల్లడించాయి. వచ్చేనెల 4వ తేదీన బంగ్లాదేశ్‌తో ఢిల్లీలో మొదటి టీ-20 జరుగుతుంది. రెండో మ్యాచ్ 7న రాజ్‌కోట్‌లో, చివరిదైన మూడో మ్యాచ్ 10న నాగపూర్‌లో జరుగుతాయి. ప్రస్తుతం వివిధ దేశాల్లో జరుగుతున్న టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. నవంబర్ 14న ఇండోర్‌లో మొదటి టెస్టు మొదలవుతుంది. 22న కోల్‌కతాలో రెండో టెస్టు ప్రారంభమవుతుంది. కాగా, డిసెంబర్‌లో విండీస్ జట్టుకు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. విండీస్ ఇక్కడ మూడు వనే్డలు, మరో మూడు టీ-20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది.

*చిత్రం... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ