క్రీడాభూమి

నాలుగో బౌలర్‌గా నోర్జె రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: దక్షిణాఫ్రికా బౌలర్ ఎన్రిచ్ నోర్జెకు ఈ టెస్టు చిలకాలం గుర్తుండిపోతుంది. కెరీర్‌లో అతను తొలి టెస్టు వికెట్‌ను ఈ మ్యాచ్‌లో కూల్చాడు. అందులో విచిత్రం లేకపోయినా, అది ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన టీమిండియా కెప్టెన్‌ది కావడం విశేషం. 12 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద నోర్జె బౌలింగ్‌లో అడ్డంగా దొరికిపోయిన కోహ్లీ ఎల్‌బీగా వెనుదిరిగాడు. తమతమ తొలి వికెట్‌గా కోహ్లీని ఔట్ చేసిన నాలుగో బౌలర్‌గా నోర్జె రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకున్నాడు. ఇంతకు ముందు కాగిసో రబదా, అల్జారీ జోసెఫ్, సెనురాన్ ముత్తుస్వామి కూడా తమతమ తొలి టెస్టు వికెట్‌గా కోహ్లీని ఔట్ చేశారు. ఆ జాబితాలో ఇప్పుడు నోర్జె కూడా చేరాడు.
*చిత్రం...దక్షిణాఫ్రికా బౌలర్ ఎన్రిచ్ నోర్జె