క్రీడాభూమి

రోహిత్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో దూకుడును ప్రదర్శిస్తున్న భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి సత్తా చాటాడు. శనివారం ఇక్కడ ప్రారంభమైన మూడవ, చివరి టెస్టు తొలి రోజు ఆటలో సెంచరీ సాధించిన అతను నాటౌట్‌గా నిలిచాడు. అజింక్య రహానే 83 పరుగులతో క్రీజ్‌లో ఉండగా, తగినంత వెలుతురు లేనికారణంగా మొదటి రోజు ఆటను నిర్ణీత సమయానికంటే ముందుగానే నిలిపివేసే సమయానికి భారత్ 3 వికెట్లకు 224 పరుగులు సాధించింది. మరోసారి ప్రత్యర్థిని చిత్తుచేసేందుకు అవసరమైన బలమైన పునాది వేసుకుంది. నిజానికి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే బలమైన దెబ్బ తగిలింది. 19 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లతో 10 పరుగులు చేసిన మాయాంక్ అగర్వాల్‌ను డీన్ ఎల్గార్ క్యాచ్ అందుకోగా కాగిసో రబదా ఔట్ చేశాడు. 12 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడడంలో ‘ది వాల్’ రాహుల్ శర్మను గుర్తుకుతెచ్చే చటేశ్వర్ పుజారా తొమ్మిది బంతులు ఎదుర్కొని, పరుగుల ఖాతా తెరవకుండానే, రబదా బౌలింగ్‌లో ఎల్‌బీగా పెవిలియన్ చేరాడు. అప్పటికి భారత్ స్కోరు 16 పరుగులు. రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 12 పరుగుకే, ఎన్రిచ్ నోర్జె బౌలింగ్‌లో ఎల్‌బీ అయ్యాడు. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌ను, థర్డ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన అజింక్య రహానేతో కలిసి రోహిత్ ఆదుకున్నాడు. ఇద్దరూ దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును ముందుకు దూకించారు.
డేన్ పిడిట్ వేసిన ఇన్నింగ్స్‌లోని 39వ ఓవర్ మూడో బంతిలో సింగిల్ చేసిన రహానే టెస్టు కెరీర్‌లో 21వ సెంచరీ నమోదు చేశాడు. కాగా, ఇన్నింగ్స్‌లో 45వ ఓవర్ వేసిన పిడిట్ బౌలింగ్‌లోనే, లాంగ్ ఆఫ్ మీదుగా అద్భుతమైన సిక్స్ కొట్టి, రోహిత్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది ఆరో సెంచరీ. ఈ సిరీస్‌లో మూడోది. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను ఏమాత్రం లక్ష్యపెట్టకుండా పరుగులు రాబట్టిన వీరు మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు. 58 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్లకు 224 పరుగులకు చేరింది. ఈ దశలో, వెలుతురు సరిగ్గా లేకపోవడంతో మొదటి రోజు ఆట ముగిసినట్టు అంపైర్లు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, నిగెల్ లాంగ్ ప్రకటించారు. అప్పటికి రోహిత్ 117, రహానే 83 పరుగులతో నాటౌట్‌గా ఉండగా, కాగిసో రబదా 54 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. ఎన్రిచ్ నోర్జెకు ఒక వికెట్ లభించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడో టెస్టును కూడా గెల్చుకవడం ద్వారా క్లీన్ స్వీప్ సాధించాలని భారత్ పట్టుదలతో ఉంటే, వీలైతే గెలిచి పరువు నిలబెట్టుకోవాలని, లేకపోతే కనీసం డ్రా చేసుకొని వైట్‌వాష్ నుంచి బటయపడాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: మాయాంక్ అగర్వాల్ సీ డీన్ ఎల్గార్ బీ కాగిసో రబదా 10, రోహిత్ శర్మ 117 నాటౌట్, చటేశ్వర్ పుజారా ఎల్‌బీ కాగిసో రబదా 0, విరాట్ కోహ్లీ ఎల్‌బీ ఎన్రిచ్ నోర్జె 12, అజింక్య రహానే 83 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 2, మొత్తం (58 ఓవర్లలో 3 వికెట్లకు) 224.
వికెట్ల పతనం: 1-12, 2-16, 3-39.
బౌలింగ్: కాగిసో రబదా 14-5-54-2, లున్గీ ఎన్గిడీ 11-44-36-0, ఎన్రిచ్ నోర్జె 16-3-50-1, జార్జి లినే్డ 11-1-40-0, డేన్ పిడిట్ 6-0-43-0.

* ఒక టెస్టు సిరీస్‌లో ఎక్కువ సెంచరీలు చేసిన ఓపెనర్ల జాబితాలో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మొదటి మూడు స్థానాలను ఆక్రమించాడు. 1970-71 సీజన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో అతను నాలుగు శతకాలు నమోదు చేశాడు. 1978-79 సీజన్‌లో అదే జట్టుపై అతను సిరీస్‌లో నాలుగు సెంచరీలతో తన రికార్డును తనే సమం చేశాడు. 1977-78 సీజన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా అతను మూడు శతకాలను సాధించాడు. కాగా, రోహిత్ ఇప్పుడు మూడు శతకాలతో అతని సరసన చేరాడు. మొదటి టెస్టు మాదిరిగానే ఈ టెస్టులోనూ అతను రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీ చేస్తే, గవాస్కర్‌తో సమానంగా రికార్డును పంచుకుంటాడు.
*ఈ సిరీస్‌కు ముందు రోహిత్ ఆరు టెస్టులు ఆడి, 12.41 సగటుతో 149 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, ఈ సిరీస్‌లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న అతను మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 117 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 176, 127 చొప్పున పరుగులు చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులకే ఔటయ్యాడు. అయితే, ఆ టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ అజేయంగా 254 పరుగులు చేసిన నేపథ్యంలో, భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయభేరి మోగించింది. కాగా, అప్పటికే రెండు టెస్టుల్లో కలిపి 317 పరుగులు చేసిన రోహిత్, మూడో టెస్టులో ఇప్పటికే 117 పరుగులు చేశాడు. దీనితో ఈ సిరీస్‌లో అతని పరుగులు 434కు చేరాయి.

*చిత్రం...సెంచరీ హీరో రోహిత్ శర్మ