క్రీడాభూమి

ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ జట్టు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, అక్టోబర్ 21: వచ్చే నెలలో ఆస్ట్రేలియా తో జరగబోయే టీ20, టెస్టు సిరీస్‌లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోమవారం తమ జట్టును ప్రకటిం చింది. జట్టులో కొత్తగా ఐదుగురు ఆటగాళ్లకు చో టు కల్పించగా, మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు టెస్టు జట్టు లోనూ చోటు దక్కలేదు. అయతే పాక్ మాజీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదీర్ కుమారుడు ఉస్మాన్‌కు తుది జట్టులో చోటు దక్కడం విశేషం. 26 ఏళ్ల ఉస్మాన్ లెగ్ స్పిన్నర్‌తో పాటు ఆల్‌రౌండర్ కూడా. ఆస్ట్రేలియా వేదికగా గతేడాది జరిగిన బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లోనూ పాల్గొన్నాడు. అయతే టీ20 జట్టులో సీనియర్ ఆటగాళ్లయనా షోయాబ్ మాలిక్, అహ్మద్ షెహజాద్ ను పక్కనబెట్టారు. మొ త్తం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నవంబర్ 3న మొదటి మ్యాచ్ సిడ్నీ వేదికగా జరగనుంది. 5న కాన్‌బెర్రా, 8న పెర్త్‌లో రెండు, మ్యాచ్‌లను నిర్వ హించనున్నారు. ఇక నవంబర్ 21-25న అడిలైడ్ వేదికగా మొదటి టెస్టు జరగనుండగా, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు రెండో టెస్టును ఆడనున్నారు.
టెస్టు జట్టు: అజార్ అలీ (కెప్టెన్), అబిద్ అలీ, అసద్ షఫీఖ్, బాబర్ అజమ్, హారిస్ సోహైల్, ఇమామ్ ఉల్ హక్, ఇమ్రాన్ ఖాన్ సీనియర్, ఇఫ్తిక ర్ అహ్మద్, ఖషీఫ్ భాటి, మహ్మద్ అబ్బాస్, మహ్మ ద్ రిజ్వాన్, ముస ఖాన్, నసీమ్ షా, షాహీన్ అఫ్రి దీ, షాన్ మసూద్, యాసిర్ షా.
టీ20 జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), అసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హారిస్ సోహైల్, ఇఫ్తికర్ అహ్మ ద్, ఇమాద్ వసీం, ఇమామ్ ఉల్ హక్, ఖుష్దీ షా, మహ్మద్ అమీర్, మహ్మద్ హస్‌నైన్, మహ్మద్ ఇర్ఫా న్, మహ్మద్ రిజ్వాన్, ముస ఖాన్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాదీర్, వాహబ్ రియాజ్.