క్రీడాభూమి

ఐదు వేదికలైతే బాగుంటుంది: కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, అక్టోబర్ 22: ఇకముందు భారత్‌లో జరగబోయే టెస్టు మ్యాచ్ లకు శాశ్వత వేదికలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మ్యాచ్ అనం తరం కోహ్లీ మాట్లాడుతూ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తరహా ఐదు వేదికలుంటే బాగుంటుందన్నాడు. అసిస్‌లో పెద్ద జట్లు పర్యటించినపుడు మెల్‌బోర్న్, సిడ్నీ, పెర్త్, బ్రిస్బెన్స్, అడిలైడ్‌లో మ్యా చులు నిర్వహించరన్నాడు. అలాగే ఇంగ్లాండ్‌నూ లార్డ్స్, ఓవల్, ట్రెంట్ బ్రిడ్జ్, ఓల్డ్ ట్రాఫోర్డ్, ఎడ్జ్‌బాస్టన్, సౌథాంప్ట న్, హెడింగ్లే వేదికలున్నాయ ని పేర్కొ న్నాడు. చానాళ్లుగా మేం దీనిపై చర్చి స్తున్నామని, నా ఉద్దేశం ప్ర కారం టెస్టు క్రికెట్ బతకాలంటే, ఆసక్తికరంగా ఉండాలంటే ఐదు శాశ్వ త వేదికలు చాలన్నాడు.
అభిమానులు వస్తారో లేదో తెలియని స్టేడియాల్లో నిర్వహణతో లాభం లేదని, భారత్‌కు వచ్చే ప్రతి జట్టుకు ఎక్కడ ఆడతామో ముందే తె లియాలని చెప్పాడు. రాష్ట్ర సంఘా లు, రొటేషన్ పద్ధతి గురించి తమకు తెలుసునని, అవి టీ20, వనే్డ క్రికెట్‌కైతే మంచివన్నాడు. ఉపఖండ పర్యటనకు వచ్చే టెస్టు జట్లకు మాత్రం పిచ్‌లు, వా టి స్వభావాలు, అభిమానుల గురించి ముందే వివరించాలన్నాడు.