క్రీడాభూమి

నిఖత్‌కు న్యాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: జపాన్‌లోని టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరుగనున్న ఒలింపిక్స్‌కు వెళ్లే భారత బృందంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు అవకాశం కల్పించేలా చర్య లు తీసుకోవాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజుజుకు ఒక లేఖ రాశారు. తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ యువ ప్రతిభావంతురాలని, 51 కేజీల విభాగంలో అనేక ఘన విజయాలు సాధించిందని మంత్రి పేర్కొన్నారు. అయితే టోక్యో లో 2020లో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు సెలక్షన్ ట్రయల్స్‌లో సత్తా చాటుకునే ఆవకాశం కల్పించలేదని, ఈ విషయంలో కేంద్ర క్రీడల మంత్రి జోక్యం చేసుకుని నిజమైన క్రీడాస్ఫూర్తి కలిగిన క్రీడాకారులకు న్యాయం చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. కాగా, ఎప్పుడూ 48 కేజీల విభాగంలో కేటగిరీలో పాల్గొనే సీనియర్ బాక్సర్ మేరీ కోమ్ ఇటీవలే 51 కిలోల విభాగానికి మారింది. దీంతో 51 కిలోల విభాగంలో పోటీప డే నిఖత్ జరీన్‌కు అన్యాయం జరిగిం ది. టోక్యో ఒలింపిక్స్‌కు కూడా సెలక్షన్ ట్రయల్స్ లేకుండానే మేరీ కోమ్ ను పంపేందుకు వీలుగా నిబంధనలు మార్చేందుకు భారత బాక్సింగ్ సమా ఖ్య సమయత్తమైంది. దీంతో ఈ విషయంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిర ణ్ రిజుజుకు నిఖత్ లేఖ రాసింది. మేరీ కోమ్‌తో తనకు పోటీ నిర్వహించాలని, అందులో విజేతను టోక్యో ఓలింపిక్స్‌కు పంపాలని ఆమె కోరిం ది. దీనిపై మేరీ కోమ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం తెలిసిన విష యం విదితమే. ఈ నిఖత్ జరీన్ ఎవ రు? అంటూ అవమానకరంగా మా ట్లాడడంతో తెలంగాణ క్రీడా వర్గాలు మండిపడ్డాయి. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ బాల్యం నుంచే బాక్సింగ్ క్రీడలో మం చి ప్రతిభను కనబరుస్తూ అంచలంచెలుగా ఎదిగి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పలు బంగారు పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిందని రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సా ట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ప్రశంసించారు. నిఖత్ జరీన్‌ను ఒ లింపిక్స్ ఎంపిక కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని ఆమె తండ్రి జామీల్ అహమ్మద్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.

*చిత్రం...రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు వినతిపత్రం అందజేస్తున్న నిఖత్ జరీన్ తండ్రి జామీల్ అహమ్మద్