క్రీడాభూమి

ఫైనల్‌కు కర్నాటక, తమిళనాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 23: దేశవాళీ ప్రతిష్టాత్మక ట్రోఫీ ముగింపుకు దశకు చేరుకుంది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో కర్నాటక, తమిళనాడు జట్లు చత్తీస్‌గఢ్, గుజరా త్ జట్లపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాయ. ఈ రెండు జట్లు శుక్రవారం బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఫైనల్‌లో తలపడనున్నాయ.
సొంత మైదానంలో చెలరేగిన కర్నాటక..
చత్తీస్‌గఢ్‌తో సొంత మైదానంలో జరిగిన సెమీ ఫైనల్ లో కర్నాటక విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చత్తీస్‌గఢ్ జట్టు 223 పరుగులకు ఆలౌ టైంది. అమన్‌దీప్ ఖరే (78) అర్ధ సెంచరీతో రాణించగా, సుమిత్ రుకార్ (40), అజయ్ జాదవ్ మండల్ (26), కెప్టెన్ హర్‌ప్రీత్ సింగ్ (25), అశుతోష్ సింగ్ (20) రాణిం చారు. కర్నాటక బౌలర్లలో కౌశిక్ 4 వికెట్లు పడగొట్టగా, అభిమన్యూ మిథున్, క్రిష్ణప్ప గౌతమ్, ప్రవీణ్ దుబే తలా రెండేసి వికెట్లను తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు జట్టు 40 ఓవర్లలోనే కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయ విజయం సాధించింది. ఓపెనర్లు లోకేష్ రాహుల్ (88, నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్ (92)తో పాటు మయాంక్ అగర్వాల్ (47, నాటౌట్) రాణించారు. మొదటి వికెట్‌కు కర్నాటక ఓపెనర్లు 155 పరుగుల విలువైన భాగ స్వామ్యాన్ని అందించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో కర్నాటక ఫైనల్‌కు దూసు కెళ్లింది. శుక్రవారం జరిగే తుది పోరులో తమిళనాడుతో సొంత గడ్డపై తలపడనుంది.
రాణించిన షారూఖ్‌ఖాన్..
గుజరాత్-తమిళనాడు మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో తమిళనాడు జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడిన గుజరాత్ జట్టు ముందుగా బ్యా టింగ్‌కు దిగింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించ డంతో అంపైర్లు 40 ఓవర్లకు కుదించారు. దీంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయ 177 పరుగులు చేసిం ది. ధ్రువ్ రావల్ (40), చివర్లలో చింతన్ గజ (24, నాటౌట్) రాణించారు. తమిళనాడు బౌలర్లలో మహమ్మద్ 3 వికెట్లు తీసుకోగా, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, బాబా అపరాజిత్ తలా ఒక వికెట్‌ను పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు జట్టులో షారూఖ్ ఖాన్ (56, నాటౌట్) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా, ఓపెనర్ అభినవ్ ముకుంద్ (32), కెప్టెన్ దినేష్ కార్తీక్ (47) రాణించడంతో తమిళనాడు జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్లను కోల్పోయ విజయం సాధించి, ఫైనల్‌కు చేరుకుంది.