క్రీడాభూమి

జట్టుకు సహాయ సహకారాలు అందిస్తాం: గంగూలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 23: భారత క్రికెట్‌కు మేలు చేసేం దుకే తామున్నామని నూతనంగా బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యత లు చేపట్టిన సౌరవ్ గంగూలీ అన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడి గా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తు న్నానని సౌరవ్ తెలిపాడు. పదవి చేపట్టిన తర్వాత మీడియాతో మా ట్లాడాడు. ప్రస్తుతం భారత జట్టు అద్భు తంగా ఉందని, కెప్టె న్ కోహ్లీకి అన్నివిధాలా సహాయ సహ కారాలు అందిస్తామ ని గంగూలీ స్పష్టం చేశాడు. కొత్త పా లకవర్గం బాధ్యతలు చేపట్టినందున కెప్టె న్, కోచ్ గురించి ఇప్పుడే మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించాడు. క్రికెట్ క మిటీలు, సంఘాల్లోకి మాజీ క్రికెటర్లు రావడం సంతోషం గా ఉందన్నాడు. ముంబయ టీమిండియాకు ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లను అం దించిందని చెప్పాడు. భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీది ప్రత్యేక స్థానమని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. కెప్టెన్, కోచ్, ఆటగాళ్ల ఎంపికంతా సెలక్షన్ కమిటీ చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశాడు. అలాగే దేశంలోని ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని చెప్పాడు.
*చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ