క్రీడాభూమి

నేడు విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: దేశవాళీ ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ విజేత ఎవరో శుక్రవారం తేలనుంది. నేడు బెంగళూరు వేదికగా చినస్వామి స్టేడియంలో జరిగే తుది పోరులో తమిళనాడు- కర్నాటక జట్లు తలపడనున్నాయ. ఇప్పటికే ఈ ట్రోఫీని తమిళనాడు జట్టు ఐదుసార్లు, కర్నాటక జట్టు రెండు సార్లు అందుకున్నాయ. అయతే నేడు జరగబోయే మ్యాచ్‌లో ఇరు జట్లు విజయం తమదే నన్న ధీమాలో ఉన్నాయ. అయతే తమిళనాడు జట్టులో కెప్టెన్ దినేష్ కార్తీక్ సహా ఆటగాళ్లంతా మంచి ఫాంలో ఉండగా, గత సెమీ ఫైనల్‌లో కర్నా టక ఓపెనర్లు లోకేష్ రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్, మయాంక్ అగర్వాల్‌తో కూడిన బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. ఏదేమైనా నేడు జరిగే ఫైనల్ రసవత్తరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.