క్రీడాభూమి

టీ10 లీగ్‌లో యువరాజ్‌సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, అక్టోబర్ 24: అబుదాబి వేదికగా వచ్చే నెల 15 నుంచి ప్రారం భమయ్యే టీ10లీగ్‌లో టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌కు సింగ్ ఆడనున్నాడు. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో యువీ మరఠా అరేబియన్స్ జట్టుకు ప్రాతిని ధ్యం వహిస్తున్నాడు. ఇటీవలే అంతర్జా తీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన యువరాజ్ సింగ్ ఆ తర్వాత గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీ10 లీగ్‌లో మరఠా అరేబియన్స్ తరఫున యువీ తో పాటు శ్రీలంక పేసర్ లసిత్ మలింగ, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఆడుతున్నారు. అయతే కెనడా టీ20 లీగ్‌లో ఫర్వాలేదనిపించిన యువరాజ్, గత ఐపీఎల్‌లో ముంబై తరఫున ఆడి నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.
*చిత్రం... యువరాజ్‌సింగ్