క్రీడాభూమి

బంగ్లా మహిళలపై పాకిస్తాన్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, అక్టోబర్ 26: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్ జట్టుపై పాకిస్తాన్ మహిళా జట్టు 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టులో కెప్టెన్ బిస్మా మారూఫ్ (34), ఒమైమా సోహైల్ (33), ఇరాం జావేద్ (21) రాణించ డంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను నష్టపోయ 126 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో జహనరా ఆలమ్ 4 వికెట్లు పడగొట్టగా, పన్నా గోష్, లతా మోండ ల్, రుమానా అహ్మద్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 112 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాట్స్‌వుమెన్‌లో రుమానా అహ్మద్ (50) మినహా మరెవ్వరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు.