క్రీడాభూమి

శాశ్వత వేదికలైతేనే బాగుంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: భారత్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌లకు శాశ్వ త వేదికలను ఏర్పాటు చేస్తే బాగుంటుం దని కోహ్లీ చేసిన వ్యాఖ్యలను టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఏకీభవించాడు. ఈ సందర్భంగా కుంబ్లే మాట్లాడుతూ అభిమానులకు మెరుగైన వౌలిక సదుపా యాలు, సౌకర్యాలు కల్పిస్తే టెస్టు క్రికెట్‌ను బతికించుకో వచ్చని అన్నాడు. టెస్టులను బతికించుకోడానికి మెరుగైన మార్కె టింగ్ పద్ధతులను అవలంభించాలని సూచించాడు. అలాగే టెస్టు క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు ఇదోక మార్గ మని, వేదికలను తగ్గించ డమే కాకుండా మ్యాచ్‌ల నిర్వహ ణ సమయమూ కీలకమేనన్నాడు. వీటితో పాటు అభిమా నులకు మెరుగైన సదుపాయాలు, వౌలిక వసతులు కల్పించొచ్చని అభిప్రాయపడ్డాడు. సీజన్ మొదలైనపుడు ఢిల్లీ తర్వాత బెంగళూరు, ముంబై, కోల్‌కతాలో టెస్టులు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పాడు. టెస్టు సెంటర్లను ప్రో త్సహించడం టెస్టు క్రికెట్‌కు చాలా ముఖ్యమని భావిస్తు న్నట్లు వివరించాడు. దీంతో సీజన్ ప్రారంభానికి ముందే మ్యాచులు ఎక్కడెక్కడ మ్యాచు లు జరుగుతాయో ముందే తెలుస్తుందన్నాడు. తను కోచ్‌గా ఉన్న సమయంలో ఆరు వేర్వేరు వేదికల్లో మ్యాచులు జరగ్గా, అన్నీ కొత్త వేనని పే ర్కొన్నాడు. అయితే అందులో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్ మాత్రమే అభిమానులతో నిండిందని, నగరం నడి బొడ్డున మైదానం ఉండడంతోనే సమయంతో సంబంధం లేకుండా ప్రేక్షకు లు ఆటను చూడ్డానికి వచ్చారని కుంబ్లే గుర్తుచేశాడు.

*చిత్రం...టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే