క్రీడాభూమి

టైటిల్ దిశగా జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 2: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేశాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో అతను థామస్ బెర్డిచ్‌ని 6-3, 7-5, 6-3 తేడాతో ఓడించి సెమీస్‌కు చేరాడు. 11 పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలంకాగా, అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఈ ట్రోఫీని అందుకోవడానికి జొకోవిచ్ మరోసారి రంగంలోకి దిగాడు. తొమ్మిది పర్యాయాలు విజేతగా నిలిచి రికార్డు సృష్టించిన ‘క్లే కోర్టు హీరో’ రాఫెల్ నాదల్ మణికట్టు గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో జొకోవిచ్‌కి టైటిల్ సాధించే అవకాశాలు మెరుగుపడ్డాయి. ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ఆండీ ముర్రేతో సెమీ ఫైనల్‌లోనూ పోరాడే అవసరం రాకపోవడంతో జొకోవిచ్ ఫైనల్ చేరడం ఖాయంగా కనిపిస్తున్నది. అతను సెమీ ఫైనల్‌లో డొమినిక్ థియెమ్‌తో తలపడతాడు. థియెన్ క్వార్టర్ ఫైనల్‌లో డేవిడ్ గోఫిన్‌ను 4-6, 7-6, 6-4, 6-1
తేడాతో
ఓడించి సెమీస్‌లో స్థానం సంపాదించాడు.
అయితే, ప్రపంచ నంబర్ వన్ జొకోవిచ్‌ను నిలువరించే సత్తా అతనికి లేదనే అనుకోవాలి. ఇలావుంటే, రెండో సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రిన్కా, ఆండీ ముర్రే ఢీ కొంటారు. అల్బర్ట్ రామోస్ వినోలాస్‌ను వావ్రిన్కా, రిచర్డ్ గాస్క్వెట్‌ను ముర్రే ఓడించి సెమీస్‌లో స్థానం సంపాదించి, జొకోవిచ్‌కు సవాలు విసురు తున్న విషయం తెలిసిందే.

chitram నొవాక్ జొకోవిచ్