క్రీడాభూమి

బంగ్లాపై పాక్ మహిళల విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, అక్టోబర్ 28: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ మహిళా జట్టు 15 పరుగుల తేడాతో విజయం సా ధించింది. ముందుగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో పాకిస్తాన్ నిర్ణీ త ఓవర్లలో 3 వికెట్లు నష్టపో య 167 పరుగులు చేసింది. ఓపెనర్ జవేరి యా ఖాన్ (52)తో పాటు కెప్టెన్ బి స్మా మరూఫ్ (70, నాటౌట్) అర్ధ సెం చరీలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌల ర్లలో జహనరా అలాం 2 వికెట్లు పడ గొట్టగా, లతా మోండల్ 1 వికెట్ తీసు కుంది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగి న బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయ 152 పరుగులు మాత్రమే చేసింది. సంజిదా ఇస్లాం (45), ఫర్గానా హక్ (30) నిగర్ సుల్తా నా (21) మాత్రమే ఫర్వాలేదనిపించా రు. పాక్ బౌలర్లలో సదియా ఇక్బాల్ మూడు వికెట్లను తీయగా, డయానా బేగ్, అనాం అమీన్, సనా మీర్ తలో వికెట్‌ను పడగొట్టారు. ఈ విజయం తో పాకిస్తాన్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది.