క్రీడాభూమి

పేసర్లే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఆస్ట్రేలియాలో టూర్ జరుగుతున్న నేపథ్యంలో సెలక్టర్లు ఫాస్ట్ బౌలర్లకే పెద్దపీట వేసే అవకాశాలున్నాయి. ఇశాంత్ శర్మ, మహమ్మద్ షమీలకు ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ తదితరుల నుంచి గట్టిపోటీ ఎదురుకాక తప్పదు. పేసర్‌గా సేవలు అందించగల ఆల్‌రౌండర్ అవరం ఉందని సెలక్టర్లు గట్టిగా అనుకుంటే స్టువర్ట్ బిన్నీ జట్టులోకి వస్తాడు. అయితే, అతను తనకు లభించిన ఏ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ కోణంలో ఆలోచిస్తే అతనిని సెలక్టర్లు ఎంపిక చేయకపోవచ్చు. స్పిన్ విభాగానికి వస్తే హర్భజన్ సింగ్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన వనే్డ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన హర్భజన్ ఆరు వికెట్లు పడగొట్టాడు. ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. కాబట్టి అతనికి అవకాశం లభించినా ఆశ్చర్యం లేదు.