క్రీడాభూమి

పరుగు తేడాతో ఓడిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంటిగ్వా, నవంబర్ 2: కరేబియ న్ పర్యటనను భారత మహిళా జట్టు ఓటమితో ప్రారంభించింది. శుక్రవా రం రాత్రి జరిగిన మొదటి వనే్డలో మిథాలీ సేన 1 పరుగు తేడాతో పరాజయం పాలైంది. అంతకుముం దు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 225 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యాట్స్‌వుమన్ నటషా మెక్ లియాన్ (51)కి తోడు కెప్టెన్ స్ట్ఫానీ టేలర్ (94), చిడియన్ నేషన్ (43)లు రాణించారు.
భారత బౌలర్లలో శిఖా పాండే, దీప్తి శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా, జులాన్ గోస్వామి, ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్ తలా 1 వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్య ఛేదన కు దిగిన భారత్ 224 పరుగులకే ఆలౌటై పరుగు తేడాతో ఓడింది. ఓపె నర్ ప్రియా పూనియా (75), జెమీమా రోడ్రిగ్స్ (41) మాత్రమే చెప్పుకోదగిన స్కోరు సాధించారు.
విండీస్ బౌలర్ల లో అనీషా మహమ్మద్ 5 వికెట్లను తీసుకోగా, స్ట్ఫానీ టేలర్, షబిక గజ్నాబి రెండేసి వికెట్లు పడగొట్టారు.