క్రీడాభూమి

మ్యాచ్ ఫిక్సర్లతో కలిసి ఆడడం బాధించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: మ్యాచ్ ఫిక్సర్లతో కలిసి క్రికెట్ ఆడడాన్ని తలుచుకుంటే ఇప్పటికీ బాధేస్తుందని 41ఏళ్ల పాకిస్తాన్ మాజీ పేసర్, రావ ల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సం చలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల బం గ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ ను బుకీలు సంప్రదించినా, విష యం చెప్పకపోవడంతో ఐసీసీ రెండేళ్ల పాటు నిషేధించిన విషయం తెలిసిం దే. ఈ నేప థ్యంలో తమ క్రికెటరర్ల స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం గురించి అక్తర్ పేర్కొన్నాడు. తానెప్పు డూ ఫిక్సింగ్ చేయలేదని, అయనా వారితో కలిసి ఆడడం మాత్రం తనను తీవ్రం గా కలిచి వేసిందని పేర్కొ న్నాడు. మహ్మద్ అమిర్, అసిఫ్, సల్మాన్ భట్‌లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురికావడం తన కెరీర్‌లో ఓ చేదు జ్ఞాపకమని గుర్తుచేసుకున్నా డు. 2011లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో మహ్మద్ అమిర్, అసిఫ్‌లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారనే విషయం తెలియగానే చాలా బాధపడినట్లు పేర్కొన్నాడు. నేను మొత్తం 22మందికి వ్యతిరేకంగా క్రికెట్ ఆడానని, అసలు మ్యాచ్ ఫిక్సర్ ఎవరు అనేది తెలుసు కోలేక పోయానన్నాడు. మ్యాచ్ ఫి క్సింగ్ పాల్పడిన అసిఫ్ మొత్తం మ్యాచ్‌లన్నీ బుకీలు ఫిక్సింగ్ చేసిన ట్లు తనకు చెప్పాడని వివరించాడు. అమిర్, అసిఫ్‌లు కొంత డబ్బుకే ఆశపడి కెరీర్‌ను నాశనం చేసుకు న్నారని, జట్టులోని ఇద్దరు టాప్ బౌలర్లు ఇలా చేయడం బాధించిందని అక్తర్ పేర్కొన్నాడు.
*చిత్రం... పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్