క్రీడాభూమి

భారత్‌కు బంగ్లా షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 3: అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి టీ-20 ఇంటర్నేషనల్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ షాకిచ్చింది. హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన టీమిండియాను ఏకంగా 7 వికెట్ల తేడాతో చిత్తుచేసి, సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. సీనియర్ ఆటగాడు, వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీం అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యం బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్‌ను 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులకే నిలువరించిన బంగ్లాదేశ్ ఆతర్వాత లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. చివరి ఓవర్‌లో విజయానికి బంగ్లా నాలుగు పరుగుల దూరంలో ఉండగా, కెరీర్‌లో తొలి టీ-20 ఇంటర్నేషనల్ ఆడిన శివమ్ దూబేతో ఆ కీలక ఓవర్‌ను వేయించడంలో భారత స్టాండ్ ఇన్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లు ఆడినప్పటికీ, ఆరు వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. రనౌటైన ఓపెనర్ శిఖర్ ధావన్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లోకేష్ రాహుల్ 15, శ్రేయాస్ అయ్యర్ 22, రిషభ్ పంత్ 27 చొప్పున పరుగులు చేశారు. చివరిలో కృణాల్ పాండ్య (15), వాషింగ్టన్ సుందర్ (14) వేగంగా పరుగులకు ప్రయత్నించకపోతే, భారత్‌కు ఈ మాత్రం స్కోరు కూడా సాధ్యమయ్యేది కాదు. బంగ్లా బౌలర్లలో షఫీయుల్ ఇస్లాం, అమీనుల్ ఇస్లాం చెరి రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఎనిమిది పరుగుల స్కోరు వద్ద లింటన్ దాస్ (7) వికెట్‌ను కోల్పోయింది. అతను దీపక్ చాహర్ బౌలింగ్‌లో లోకేష్ రాహుల్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సౌమ్య సర్కార్‌తో కలిసి ఓపెనర్ మహమ్మద్ నరుూమ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 26 పరుగులు సాధించిన అతనిని శిఖర్ ధావన్ క్యాచ్ అందుకోగా యుజువేంద్ర చాహల్ పెవిలియన్‌కు పంపా డు. ఈ దశలో వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీం భారత బౌలింగ్‌పై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ మహమ్మదుల్లాతో కలిసి అత ను బంగ్లాదేశ్‌ను లక్ష్యానికి చేర్చాడు. శివమ్ దూబే వేసిన చివరి ఓవర్ మూడో బంతిని సిక్సర్‌గా మలచిన అతను బంగ్లాదేశ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

*
స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ ఎల్‌బీ షఫీయుల్ ఇస్లాం 9, శిఖర్ ధావన్ రనౌట్ 41, లోకేష్ రాహుల్ సీ మహమ్మదుల్లా బీ అమీనుల్ ఇస్లాం 15, శ్రేయాస్ అయ్యర్ సీ మహమ్మద్ నరుూమ్ బీ అమీనుల్ ఇస్లాం 22, రిషభ్ పంత్ సీ మహమ్మద్ నరుూమ్ బీ షఫీయుల్ ఇస్లాం 27, శివమ్ దూబే సీ అండ్ బీ ఆఫిఫ్ హొస్సేన్ 1, కృణాల్ పాండ్య 15 నాటౌట్, వాషింగ్టన్ సుందర్ 14 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 4, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 148.
వికెట్ల పతనం: 1-10, 2-36, 3-70, 4-95, 5-102, 6-120.
బౌలింగ్: షఫీయుల్ ఇస్లాం 4-0-36-2, అల్ అమీన్ హొస్సేన్ 4-0-27-0, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 2-0-15-0, అమీనుల్ ఇస్లాం 3-0-22-2, సౌమ్య సర్కార్ 2-0-16-0, ఆఫిఫ్ హొస్సేన్ 3-0- 11-1, మొసాడెక్ హొస్సేన్ 1-0-8-0, మహమ్మదుల్లా 1-0-10-0.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లింటన్ దాస్ సీ రిషభ్ పంత్ బీ దీపక్ చాహర్ 7, మహమ్మద్ నరుూమ్ సీ శిఖర్ ధావన్ బీ యుజువేంద్ర చాహల్ 26, సౌమ్య సర్కార్ బీ ఖలీల్ అహ్మద్ 39, ముష్ఫికర్ రహీం 60 నాటౌట్, మహమ్మదుల్లా 15 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (19.3 ఓవర్లలో 3 వికెట్లకు) 154.
వికెట్ల పతనం: 1-8, 2-54, 3-114.
బౌలింగ్: దీపక్ చాహర్ 3-0-24-1, వాషింగ్టన్ సుందర్ 4-0-25-0, ఖలీల్ అహ్మద్ 4-0-3-1, యుజువేంద్ర చాహల్ 4-0- 24-1, కృణాల్ పాండ్య 4-0-32-0, శివమ్ దూబే 0.3-0-9-0.
*చిత్రం... బంగ్లాదేశ్‌ను గెలిపించిన ముష్ఫికర్ రహీం (60 నాటౌట్).