క్రీడాభూమి

సెరెనా ఆశలు సజీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 3: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అమెరికాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ (34) టైటిల్‌కు చేరువైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె అన్‌సీడెడ్ కికీ బెర్టెన్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో 60వ ర్యాంకు క్రీడాకారిణి యులియా పుతిన్‌త్సెవాపై విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిన సెరెనా విలియమ్స్ శుక్రవారం సెమీఫైనల్‌లో వరుసగా రెండో రోజు కూడా స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయినప్పటికీ 7-6 (9/7), 6-4 తేడాతో కికీ బెర్టెన్స్‌ను ఓడించి ఫైనల్‌లో ప్రవేశించింది. ఈ విజయంతో గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీల్లో చరిత్ర సృష్టించే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోగలిగిన సెరెనా విలియమ్స్ శనివారం జరుగనున్న టైటిల్ పోరులో స్పెయిన్‌కు చెందిన నాలుగో సీడ్ క్రీడాకారిణి గార్బిన్ ముగురుజా (22)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్ విజయం సాధిస్తే ఓపెన్ ఎరాలో మొత్తం 22 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు కైవసం చేసుకున్న క్రీడాకారిణిగా అలనాటి అందాల భామ స్ట్ఫెగ్రాఫ్ (జర్మనీ) 1999లో పారిస్‌లో నెలకొల్పిన రికార్డును సమం చేస్తుంది. కాగా, మహిళ సింగిల్స్ విభాగంలో జరిగిన మరో సెమీ ఫైనల్‌లో యువ క్రీడాకారిణి ముగురుజా 6-2, 6-4 సెట్ల తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన 21వ సీడ్ క్రీడాకారిణి సమంతా స్టోసర్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో ముగురుజా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో 16 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరుకున్న తొలి క్రీడాకారిణిగా రికార్డులకు ఎక్కింది. గత ఏడాది వింబుల్డన్ ఫైనల్‌లో సెరెనా విలియమ్స్ చేతిలో పరాజయం పాలై తృటిలో టైటిల్‌ను చేజార్చుకున్న ముగురుజా శనివారం ఫైనల్‌లో ‘నల్ల కలువ’ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతోంది.
అడుగు దూరంలో జొకోవిచ్
ఇదిలావుంటే, పురుషుల సింగిల్స్ విభాగంలో సెర్బియాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్‌లో అతను 6-2, 6-1, 6-4 తేడాతో 13 సీడ్ ఆటగాడు డొమినిక్ థియెమ్‌ను మట్టికరిపించాడు. టైటిల్ కోసం జొకోవిచ్ బ్రిటన్‌కు చెందిన రెండో సీడ్ ఆటగాడు ఆండీ ముర్రేతో తలపడనున్నాడు. పురుషుల సింగిల్స్‌లో జరిగిన మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ముర్రే 6-4, 6-2, 4-6, 6-2 తేడాతో స్విట్జర్లాండ్‌కు చెందిన మూడో సీడ్ ఆటగాడు స్టానిస్లాస్ వావ్రిన్కాపై చెమటోడ్చి విజయం సాధించాడు.
chitram...
22వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌కు
చేరువైన సెరెనా విలియమ్స్