క్రీడాభూమి

రోహిత్ సేన గెలిచేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, నవంబర్ 6: బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిం డియా ప్రతీకారం కోసం రగిలిపోతుంది. మొదటి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో దారుణం గా పరాజయం పాలైన భారత జట్టు గురువారం జరిగే రెండో మ్యాచ్ లో నెగ్గి సిరీస్‌ను సమం చే యాలని భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు నేటి మ్యాచ్ లోనూ గెలిచి, మరో మ్యాచ్ మిగిలి ఉ ండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
మార్పు తప్పదా?
మొదటి మ్యాచ్‌లో భారత జట్టు చెప్పుకోదగిన స్కోరే చేసినా, దానిని కాపాడుకోవడంలో విఫలమైంది. ప్రధానంగా బ్యాటింగ్‌లో మొదటి 12 ఓవర్ల పాటు నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన టీమిండియా బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడంలో ఓ రకంగా ఇబ్బంది పడిందనే చెప్పాలి. ముఖ్యంగా కెప్టెన్, ఓపెనర్ రోహిత్‌శర్మ పెవిలియన్‌కు చేరిన తర్వాత అనుభవం ఉన్న ఆటగాడు లోకేశ్ రాహుల్ తొందరగానే అవుటవ్వడం యువ ఆటగాళ్లు అయన శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, శివమ్ దుబే, కృనాల్ పాండ్యా ఆకట్టుకోలేకపోయారు. జట్టు మొత్తంగా శిఖర్ ధావన్ మాత్రమే ఫర్వాలేదనిపించాడు. అయతే రెండో మ్యాచ్‌లో మాత్రం స్వల్ప మార్పులుంటాయని, కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొనడం విశేషం. తొలి మ్యాచ్‌లో ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత్, ఆల్‌రౌండర్ శివమ్ దుబేను పేసర్‌గానూ వినియోగించుకుంది. అయతే రోహిత్ చెప్పినదాని ప్రకారం బౌలింగ్ విభాగం లోనే మార్పులు చోటు చేసుకుంటాయనే ది స్పష్టమవుతోంది. మొద టి మ్యాచ్‌లో జరిగిన తప్పిదాల్ని పునరావృతం చేయ కుండా ఈసారి విజయం సాధించాలనే పట్టుదలతో యువ ఆటగాళ్లు నెట్స్‌లో గంటల తరబడి ప్రాక్టీస్ చేశారు.
ధీమాగా బంగ్లా..
మరోవైపు భారత్‌తో జరిగిన మొదటి టీ20లో విజయం సాధించిన బంగ్లా జట్టు పూర్తి ధీమాతో కనిపిస్తోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగంలో బలంగా ఉంది. భారత్ తో సిరీస్‌కు ముం దే కెప్టెన్, ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ నిషే ధానికి గురైనా, ఏమాత్రం ఏకాగ్రత కోల్పోలేదు. అందులోనూ ఢిల్లీ వంటి మైదానంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయం సాధించింది.
మరో రికార్డుకు చేరువలో హిట్‌మ్యాన్
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ టీ20ల్లో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నా డు. గురు వారం జరిగే రెండో టీ20లో రోహిత్ శర్మ భారత్ తరఫున అత్యధిక టీ20 మ్యాచ్‌లాడిన ఆటగాడిగా రికార్డు సృష్టించ నున్నాడు. గత మ్యాచ్‌లో నే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (98) మ్యాచ్‌లను దాటిన రోహిత్ తాజాగా 100వ మ్యాచ్ ఆడు తున్న మొదటి భారత ఆటగాడిగా నిలవనున్నాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయాబ్ మాలిక్ (111) మొదటి వరుసలో ఉన్నాడు. ఇక భారత్ తరఫున మహిళా జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్ 100 టీ20 మ్యాచ్‌లాడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్‌లో టీ20ల్లో అత్యధిక పరుగులు (2452) సాధించిన బ్యాట్స్‌మ న్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత టీమిండియాకే చెందిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (2450) ఉన్నాడు.
*చిత్రం... నెట్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తున్న భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్