క్రీడాభూమి

అందుకే ఓడుతున్నాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్: టీమిండియాలో చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లున్నారు. అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో పాటు మున్ముం దు సిరీస్‌లను దృష్టిలో ఉంచుకొని టీ20ల్లో యువ కులను పరీక్షిస్తున్నట్లు భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. బుధవారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ టీ20ల్లో మేం పూర్తిస్థాయలో విజయవం తం కాకపోవడానికి కీలక ఆటగాళ్లు ఆడక పోవడమూ ఓ కారణమని వెల్లడించాడు. వనే్డలు, టెస్టులతో పోలిస్తే భారత జట్టు పొట్టి ఫార్మాట్‌లో ఆశించిన మేరకు రాణిం చడం లేదన్నాడు. యువ ఆటగాళ్లను పరీక్షిచేందుకు మేం ఎంచుకున్న ఫార్మాట్ ఇదేనని స్పష్టం చేశాడు. ఈ ఫార్మాట్‌లోనే సత్తా చాటి చాలామంది వనే్డ, టెస్టులకు ఎంపికైన విషయాన్ని రోహిత్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. రిజర్వ్ బెంచ్ సాధ్యమైనంత పటిష్టంగా ఉంచాలని అనుకుం టున్నామని, కొన్ని మ్యాచ్‌లు ఓడినంతా మాత్రాన నష్టమేమీ లేదని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు ఓటముల నుంచి నేర్చుకుంటారని ధీమా వ్యక్తం చేశాడు. గతేడాది వెస్టిండీస్‌పై గెలిచన తర్వాత ఆస్ట్రే లియా చేతిలో ఓడింది. దక్షిణాఫ్రికాతో సిరీస్ 1-1 తేడాతో సమం చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.

*చిత్రం... భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ