క్రీడాభూమి

పంజాబ్‌పై హైదరాబాద్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంఢీగఢ్, నవంబర్ 8: దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ ట్రోఫీలో గ్రూప్ సీ విభాగంలో హైదరాబాద్ జట్టు పంజాబ్‌తో తలపడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను నష్టపోయ 149 పరుగులు చేసింది. అక్షంత్ రెడ్డి (47), తన్మయ్ అగర్వాల్ (42), కెప్టెన్ అంబటి రాయుడు (34) రాణించారు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్ మూడేసి వికెట్లు తీసుకోగా, నిఖిల్ చౌదరి ఒక వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 14 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయ 97 పరుగులు చేసింది. మ్యాచ్ మధ్యలో వర్షం రావడంతో అంపైర్లు వీజేడీ నిబంధన ప్రకారం హైదరాబాద్ జట్టును 2 పరుగుల తేడాతో గెలిచినట్లుగా ప్రకటించారు.