క్రీడాభూమి

ఆంధ్రా శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 8: సయ్యద్ ముస్తాఖ్ ఆలీ ట్రోఫీ టీ-20 తొలి మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు ఘన విజయం సాధించి శుభారంభం చేసింది. విజయనగరం ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు రెండింటిలో రాణించిన ఆంధ్రా జట్టు పది వికెట్ల తేడాతో బీహార్ జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో 98 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా జట్టు కేవలం 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించింది. ఓపెనర్లు అశ్విన్ హెబ్బార్, ఐదు బౌండరీలు, రెండు సిక్సర్లతో 52 పరుగులు, హనుమ విహారి బౌండరీ, నాలుగు సిక్సర్లతో 32 బంతుల్లో 46 పరుగులు చేసి జట్టుకు సునాయాసంగా విజయాన్ని అందించారు. బౌలింగ్‌లో శశికాంత్ 20 పరుగుల మూడు వికెట్లు, నరేన్‌రెడ్డి 11 పరుగులకు రెండు వికెట్లను పడగొట్టి బీహార్ జట్టును 97పరుగులకే కట్టడి చేశారు. బీహార్ జట్టును రెహ్మత్‌ఉల్లా అజేయంగా 44 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. విశాఖలోని ఏసీఏ-విడీసీఏ స్టేడియంలో జరిగిన పోల్లో గోవా జట్టు నాలుగు వికెట్ల తేడాతో బరోడాపై, కర్ణాటక జట్టు 9 వికెట్ల తేడాతో ఉత్తరాఖండ్‌పై విజయాలు సాధించి తమ ఖాతాలో నాలుగు పాయింట్లను జమచేసుకున్నాయి.