క్రీడాభూమి

ఆసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 4: వియత్నాంలోని హోచిమిన్ సిటీలో జరుగుతున్న ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో శనివారం రెండో రోజు భారత్ నాలుగు పసిడి పతకాలతో పాటు మరో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని సత్తా చాటుకుంది. పురుషుల హ్యామర్ త్రోలో ఆశిష్ అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనతో 69 మీటర్ల దూరం హ్యామర్‌ను విసిరి శనివారం భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించగా, పరుగుల రాణి పిటి.ఉష శిష్యురాలు జిస్నా మాథ్యూ మహిళల 400 మీటర్ల రేస్‌ను 53.85 సెకన్లలో పూర్తిచేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అలాగే మహిళల 15 మీటర్ల పరుగు పోటీలో లిలీ దాస్ 4:29:50 నిమిషాల్లో లక్ష్యాన్ని అధిగమించి భారత్‌కు మూడో పసిడి పతకాన్ని అందించగా, ఇదే ఈవెంట్‌లో ఆమె సహచర అథ్లెట్ హమిలాన్ కౌర్ బైన్స్ (4:33:02 నిమిషాలు) కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కాగా, పురుషుల 1500 మీటర్ల రేస్‌లో అజయ్ కుమార్ సరోజ్ 3:57:55 నిమిషాల్లో లక్ష్యాన్ని అధిగమించి భారత్‌కు నాలుగో పసిడి పతకాన్ని అందించాడు. దీంతో శనివారం ఒకే రోజు ఐదు పతకాలు సాధించిన భారత జట్టు గత ఎడిషన్‌లో మొత్తం మీద రెండు పతకాలు సాధించిన జట్టు కంటే మెరుగైన ప్రదర్శనతో రాణించినట్లయింది.