క్రీడాభూమి

ఉత్కంఠభరిత టీ-20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్లాండ్, నవంబర్ 10: చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన హోరాహోరీ టీ-20 పోరులో సూపర్ ఓవర్ ద్వారా న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఆదివారం నాడిక్కడ జరిగిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో 11 ఓవర్ల మ్యాచ్‌గా అంపైర్లు కుదించారు. పరుగుల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీల్యాండ్ ఐదు వికెట్లు కోల్పోయి 146 పరుగులు సాధించింది. తదుపరి బ్యాంటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయి సరిగ్గా 146 పరుగులే సాధించింది. ఈ సందర్భంగా న్యూజీల్యాండ్ కెప్టెన్ టిమ్ సౌదీ వేసిన సూపర్ ఓవర్‌లో ఇంగ్లాండ్ జట్టు సారధి ఇయాన్ మోర్గాన్, బెయిర్‌స్టో జంట 17 పరుగులు సాధించింది. బదులుగా న్యూజీల్యాండ్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గుప్తిల్‌కు ముందు, టిమ్ సీఫర్ట్, కొలీన్ డీ గ్రాండోమ్ ఒక ఓవర్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశారు. గత జూన్‌లో ఈ ఇరుజట్లు ప్రపంచ కప్ పోటీల్లో తలపడిన మ్యాచ్‌ను ఈ మ్యాచ్ గుర్తు చేసింది. ఆ 50 ఓవర్ల మ్యాచ్‌లో కూడా బౌండరీల వరద పారించిన ఇంగ్లాండ్ విజయం సాధించింది. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టులో బెయిర్‌స్టో, మోర్గాన్ సిక్సర్లు బాది 18 పరుగులు చేశారు. అసలు న్యూజీల్యాండ్ ఎందుకు వికెట్ కీపర్ టిమ్ సీఫర్ట్‌ను సూపర్ ఓవర్ ఎదుర్కొనేందుకు బరిలోకి దింపిందన్న విషయం అర్థం కావడంలేదు. క్రిస్ జోర్డాన్ వేసిన ఓవర్‌లో తొలుత రెండు పరుగులు చేసి, ఆ తర్వాత వైడ్ బాల్‌ను వదిలిపెట్టాడు. తర్వాత బంతిని ఫోర్‌గా మలిచిన అతను మరుసటి బంతిని డాట్‌బాల్‌గా ఆడాడు. ఆ తర్వాత మోర్గాన్ అందుకున్న అద్భుత క్యాచ్‌తో అతను ఔటయ్యాడు. కేవలం రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన దశలో న్యూజీల్యాండ్ గుప్తిల్ తొలిబంతికి కేవలం ఒక్క పరుగే తీశాడు. దీంతో మ్యాచ్ ఫలితం తేలిపోయింది.