బిజినెస్

మారుతి ఉత్పత్తిలో అక్టోబర్‌లోనూ కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 10: మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) అక్టోబర్ నెలలో తన ఉత్పత్తిని 20.7 శాతం తగ్గించింది. దేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి తన ఉత్పత్తిలో కోత విధించుకోవడం ఇది వరుసగా తొమ్మిదో నెల. ఎంఎస్‌ఐ ఈ సంవత్సరం అక్టోబర్‌లో మొత్తం 1,19,337 యూనిట్లను ఉత్పత్తి చేసింది. గత సంవత్సరం ఇదే నెలలో 1,50,497 యూనిట్లను ఉత్పత్తి చేసినట్టు ఆ కంపెనీ నియంత్రణ సంస్థకు సమర్పించిన పత్రాలలో పేర్కొంది. 2018 అక్టోబర్‌లో 1,48,318 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను ఉత్పత్తి చేసిన మారుతి ఈ సంవత్సరం అక్టోబర్‌లో మాత్రం 1,17,383 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. అంటే ఉత్పత్తి 20.85 శాతం తగ్గిందని ఆ కంపెనీ వివరించింది.