బిజినెస్

నికర కొనుగోలుదారులు విదేశీ ఇనె్వస్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 10: దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ ఇనె్వస్టర్లు నవంబర్ తొలి వారంలో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడటంతో విదేశీ ఇనె్వస్టర్లు నవంబర్ తొలి వారంలో నికరంగా రూ. 12వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు.
తాజా డిపాజిటరీస్ గణాంకాల ప్రకారం, విదేశీ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) నవంబర్ ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు ఈక్విటీ మార్కెట్లలో నికరంగా రూ. 6,433.8 కోట్ల పెట్టుబడులు, డెబిట్ సెగ్మెంట్‌లో రూ. 5,673.87 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంటే ఎఫ్‌పీఐలు దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో నికరంగా రూ. 12,107.67 కోట్ల పెట్టుబడులు పెట్టారు. వరుసగా రెండు నెలలు నికర కొనుగోలుదారులుగా నిలిచిన విదేశీ ఇనె్వస్టర్లు మూడో నెల తొలి వారంలోనూ గణనీయంగా పెట్టుబడులు పెట్టారు. ఎఫ్‌పీఐలు అక్టోబర్ నెలలో నికరంగా రూ.16,464.6 కోట్లు, అంతకుముందు సెప్టెంబర్‌లో రూ. 6,557.8 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అయితే, ఎఫ్‌పీఐలు నవంబర్ నెలలో ఇప్పటి వరకు చేసిన కొనుగోళ్లు వారి అర్ధాంగీకారానే్న సూచిస్తున్నాయని సామ్‌కో సెక్యూరిటీస్‌లో పరిశోధన విభాగం అధిపతి ఉమేశ్ మెహతా పేర్కొన్నారు.
ఎఫ్‌పీఐలు ఈ వారంలో నికరంగా సగటున రోజుకు రూ. 550 కోట్ల కొనుగోళ్లు జరిపారని, గతంలో సగటున రోజుకు రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకు జరిపిన భారీ కొనుగోళ్లతో పోలిస్తే ఇవి తక్కువేనని ఆయన పేర్కొన్నారు.