క్రీడాభూమి

అరంగేట్రంతోనే అర్ధ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రాస్ ఐస్‌లెట్, నవంబర్ 10: అంతర్జాతీయ క్రికెట్‌లో మహిళలు, పురుషుల విభాగాల్లోని అన్ని ఫార్మేట్లలో అతి చిన్న వయసులో ఆరంభ మ్యాచ్‌లోనే అర్థ సెంచరీ సాధించిన భారత బ్యాట్స్‌వుమెన్‌గా షఫాలీ వర్మ రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ పేరిట 30 ఏళ్లుగా ఉన్న ఈ రికార్డును పదిహేనేళ్ల 285 రోజుల వయసున్న షఫాలీ బద్ధలు చేసింది. వెస్టిండీస్‌లో ఆదివారం జరిగిన ఆరంభ టీ-20 మ్యాచ్‌లో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఓపెనర్‌గా అడుగుపెట్టిన షఫాలీ 49 బంతులు ఎదుర్కొని 73 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టుపై 84 పరుగుల ఆధిక్యతతో భారత్ విజయం సాధించేందుకు షఫాలీ మెరుపు ఇన్నింగ్స్ బాటలు వేసింది. సచిన్ టెండూల్కర్ పదహారేళ్ల 214 రోజుల వయసులో ఆరంభ టెస్ట్ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేయడం జరిగింది. అలాగే ఈ హర్యానా టీనేజ్ మహిళా క్రికెటర్ స్మృతి మంధనతో కలిసి 185 పరుగుల ఆల్‌టైం రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్య స్కోరు 185 పరుగులు సాధించింది.
*చిత్రం...వెస్టిండీస్‌పై తొలి అర్ధ శతకాన్ని పూర్తి చేసిన భారత క్రికెట్ క్రీడాకారిణి షఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటున్న దృశ్యం