క్రీడాభూమి

సెంచరీలతో రాణించిన బాబర్, షఫీఖ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, నవంబర్ 11: ఆస్ట్రేలియా ఏతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా సోమవారం మొదటిరోజు పాక్తిసాన్ జట్టు రాణించింది. అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. షాన్ మసూద్, కెప్టెన్ అజార్ అలీ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయతే అజార్ అలీ (11)ను రీలే మెరీడిత్ పెవిలియన్‌కు పంపడంతో పాక్ 13 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పో యంది. ఆ తర్వాత కొద్దిసేపటికే షాన్ మసూద్ (22), హారీస్ సోహైల్ (18) వెంట వెంటనే అవుట్ కావడంతో పాక్ 60 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయ కష్టాలో పడింది. ఈ క్రమంలో క్రీజులో ఉన్న అసద్ షఫీఖ్, బాబర్ అజమ్‌లు ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదు ర్కొం టూ జట్టును ముందుండి నడిపించారు. వీరిద్దరూ చూడ చక్కని షాట్లతో అలరించారు. దీంతో తొలి రోజు ఆటలో పాకిస్తాన్ 3 వికెట్లను కోల్పోయ 336 పరుగులు చేసింది. అసద్ షఫీఖ్ (119, నాటౌట్), బాబర్ అజమ్ (157, నాటౌట్) సెంచరీలతో రాణించి, జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఆస్ట్రేలియా ఏ బౌలర్లలో రీలే మెరీడిత్ 2 వికెట్లను పడగొట్టగా, మైఖేల్ నెసీర్ 1 వికె ట్ తీశాడు.