క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ విజేత ముగురుజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 4: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్పెయిన్ క్రీడాకారిణి గార్బిన్ ముగురుజా విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన ముగురుజా శనివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ (అమెరికా)పై సంచలన విజయం సాధించి కెరీర్‌లో తొలిసారి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. వెనెజులాలో పుట్టి స్పెయిన్‌లో నివసిస్తున్న ముగురుజా క్లే కోర్టు ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరడం కెరీర్‌లో ఇదే తొలిసారి. అనుభవంతో పాటు వయసులో కూడా సెరెనా కంటే 12 ఏళ్లు చిన్నదైన ముగురుజా 7-5, 6-4 వరస సెట్ల తేడాతో అమెరికా ‘నల్ల కలువ’ను మట్టికరిపించి అందరినీ ఔరా అనిపించింది. అరంటా శాంచెజ్ వికారియో 1998లో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత ఈ టైటిల్‌ను కైవసం చేసుకున్న స్పెయిన్ క్రీడాకారిణిగా ముగురుజా చరిత్రకెక్కింది. గత ఏడాది యుఎస్ ఓపెన్‌లో ఫ్లావియా పెనె్నటా, ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో జర్మనీ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్ విజేతలుగా నిలిచిన తర్వాత గ్రాండ్ శ్లామ్ టోర్నీలో వరుసగా మూడోసారి టైటిల్ కైవసం చేసుకున్న కొత్త క్రీడాకారిణిగా ముగురుజా అవతరించింది. ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన ఈ ఫైనల్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడాకారిణి అయిన సెరెనా విలియమ్స్‌పై విజయం సాధించి తొలి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను గెలుచుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ముగురుజా పేర్కొంది. ‘సెరెనా ఎంతో శక్తిమంతమైన క్రీడాకారిణి కావడంతో ఆమెతో సాధ్యమైనంత గట్టిగా పోరాడేందుకు ప్రయత్నించా. దానికి ప్రతిఫలంగానే ఈ అద్భుత విజయాన్ని అందుకోగలిగా’ అని ముగురుజా స్పష్టం చేసింది. ఇదిలావుంటే, గ్రాండ్ శ్లామ్ ఫైనల్‌లో సెరెనాకు ఇది వరుసగా రెండో ఓటమి. దీంతో అలనాటి జర్మన్ అందాల భామ స్ట్ఫెగ్రాఫ్ ఓపెన్ ఎరాలో 22 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించి నెలకొల్పిన రికార్డును సమం చేయాలన్న సెరెనా ఆశలు నీరుగారిపోయాయి. దీంతో ఆమె వింబుల్డన్ టోర్నీపై దృష్టి కేంద్రీకరించనుంది. గతంలో ఆరుసార్లు వింబుల్డన్ టైటిళ్లు సాధించిన సెరెనా ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.