క్రీడాభూమి

నాదల్‌కు జ్వెరెవ్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 12: టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన ‘స్పెయిన్ బుల్’ ఇక్కడ ఆరంభమైన ఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నమెంట్ తొలి పోరులో జర్మనీ సంచలనం, ఏడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ఎనిమిది మంది మేటి ఆటగాళ్లు ఏటీపీ టూర్ సీజన్ ముగింపు సమయంలో పోటీపడే ఈ టోర్నమెంట్ రౌండ్ రాబిన్ విధానంలో జరుగుతుంది. కాబట్టి, తొలి మ్యాచ్ పరాజయం వల్ల నాదల్‌కు ప్రమాదం ఏమీ ఉండదు. అతను మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. మొత్తం ఎనిమిది మంది ఆటగాళ్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. రౌండ్ రాబిన్ విధానంలో మ్యాచ్‌లు ముగిసిన తర్వాత, ఒక్కో గ్రూప్‌లో మొదటి రెండు స్థానాలను ఆక్రమించిన ఆటగాళ్లు సెమీ ఫైనల్స్ చేరుతారు. గ్రూప్-1లో మొదటి స్థానంలో ఉన్న ఆటగాడు సెమీస్‌లో గ్రూప్-2లో రెండో స్థానాన్ని పొందిన ఆటగాడితో పోటీపడతాడు. అదే విధంగా గ్రూప్-2లో మొదటి స్థానాన్ని సంపాదించిన ఆటగాడు గ్రూప్-1లో రెండో స్థానంలో ఉన్న క్రీడాకారిడితో సెమీస్‌లో తలపడతాడు. ర్యాంకింగ్స్‌లో నాదల్ నంబర్ వన్‌గా ఉండగా, మిగతా ఏడు స్థానాల్లో వరుసగా నొవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్, డానిల్ మెద్వెదెవ్, డామినిక్ థియేమ్, స్టెఫెనొస్ టిస్పిపాస్, అలెగ్జాండర్ జ్వెరెవ్, మాటియో బెరెటినీ ఉన్నారు. కాగా, మొదటి మ్యాచ్‌లో జ్వెరెవ్‌ను ఢీకొన్న నాదల్ 2-6, 4-6 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి జ్వెరెవ్ పూర్తి ఆధిత్యాన్ని ప్రదర్శిస్తే, నాదల్ అందుకు భిన్నంగా ఆడాడు. మొదటి సెట్‌ను కోల్పోవడంతో కంగుతిన్న అతను రెండో సెట్‌లో ఎదురుదాడికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
*చిత్రం... మ్యాచ్ ముగిసిన తర్వాత రాఫెల్ నాదల్ (కుడి)తో అలెగ్జాండర్ జ్వెరెవ్