క్రీడాభూమి

ఏటీపీ ఫైనల్స్ టోర్నీ సెమీస్‌కు థియేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 13: స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌ను ఇక్కడ జరుగుతున్న ఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నమెంట్ రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో 6-7, 6-3, 7-6 తేడాతో ఓడించిన డామినిక్ థియేమ్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో తొలిసారి టోర్నమెంట్ ఆడుతున్న మాటియో బెరెటినిని సీనియర్ ఆటగాడు రోజర్ ఫెదరర్ 7-6, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి ముందంజ వేశాడు. 8 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్న ఈ టోర్నమెంట్‌లో రెండు గ్రూపుల్లో ఆటగాళ్లు రౌండ్ రాబిన్ విధానంలో మ్యాచ్‌లు ఆడతారు. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నవారు సెమీస్ చేరతారు. ఈసారి సెమీస్ చేరిన తొలి ఆటగాడు థియేమ్ కావడం విశేషం.