క్రీడాభూమి

డిసెంబర్ 1 నుంచి కబడ్డీ వరల్డ్ కప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, నవంబర్ 13: పంజాబ్ ప్రభుత్వం వచ్చే నెల 1 నుంచి 9వరకు ప్రపంచ కబడ్డీ వరల్డ్ కప్‌ను చండీగఢ్‌లో నిర్వహించనుంది. ఈ విషయాన్ని పంజాబ్ క్రీడా శాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గురునానక్ 550వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నామని, అందులో భారత్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, కెన్యా, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా జట్లు పాల్గొంటాయని తెలిపారు. అయితే, పాకిస్తాన్, కెన్యా, కెనడా జట్లకు ఇంకా నో అబ్జక్షన్ సర్ట్ఫికెట్ రాలేదని తెలిపారు. ఎన్‌ఓసీ వస్తేనే ఆ జట్లు టోర్నమెంట్‌లో పాల్గొంటాయని స్పష్టం చేశారు.