క్రీడాభూమి

హైదరాబాద్‌కు ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, నవంబర్ 14: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా గురువారం మహారాష్ట్ర జట్టుతో తలప డిన హైదరాబాద్ ఓటమి పాలైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 163 పరుగులు చేసింది. భవనక సందీప్ (55, నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించగా, హిమాలయ్ అగర్వాల్ (34), తన్మయ్ అగర్వాల్ (28) మాత్రమే ఫర్వాలేదని పించారు.
కెప్టెన్ అంబటి రాయుడు (16) మరోసారి విఫలమయ్యాడు. మహా రాష్ట్ర బౌలర్లలో దిగ్విజయ్ దేశ్‌ముఖ్, సత్యజిత్ బచావ్‌లు రెండేసి వికెట్లను పడగొట్టగా, సామద్ ఫల్లా, అజీం ఖాజీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర లక్ష్య ఛేదనలో మ రో బంతి మిగిలి ఉండగానే 4 వికెట లను కోల్పోయ విజయం సాధించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (7) విఫలం కాగా, రాహుల్ త్రిపాఠి (25) ఫర్వాలేదని పించాడు. ఇక సీనియర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ (68) అర్ధ సెంచరీతో రాణించగా, నౌషద్ షేక్ (34) మెరుపు లు మెరిపించగా, నిఖిల్ నాయక్ (20, నాటౌట్), అజీం ఖాజీ (4, నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించారు.