క్రీడాభూమి

మూడు రోజుల్లోనే ముగించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్: బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా విజయం సాధించింది. మూడోరోజు శనివారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 213 పరుగులకే ఆలౌట్ కావడంతో కోహ్లీసేన ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో గెలిచింది. అంతకుముందు భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌ను 493 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఈరోజు ఉదయం రెండోసారి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఆదిలోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు 10 పరుగుల వద్ద ఓపెనర్ ఇమ్రూల్ కైస్ (6)ను ఉమేశ్ యాదవ్ బౌల్డ్ చేయడంతో బంగ్లాదేశ్ మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వా త కొద్దిసేపటికే మరో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (6) ఇషాంత్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 16 పరుగులకే ఓపెనర్లిద్దరినీ బంగ్లాదేశ్ కోల్పోయింది. అయితే మొదటి ఇన్నింగ్స్‌లోనూ ఓపెనర్లిద్దరూ 6 పరుగులకే అవుట్ కావడం విశేషం. ఆ తర్వాత కొద్దిసేపటికే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మోమినుల్ హక్ (7), మహ్మద్ మిథున్ (18)ని షమీ పెవిలియన్‌కు పంపాడు. మరోవైపు ముష్ఫీకర్ రహీం, మహ్మదుల్లాతో కలిసి నెమ్మదిగా ఆడుతూ జట్టు స్కోరును పెంచే బాధ్యత తీసుకున్నాడు. ఈ క్రమంలో మహ్మదుల్లా (15) షమీ బౌలింగ్‌లో రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యా డు. దీంతో 72 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయి బంగ్లాదేశ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న రహీం..
ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ముష్ఫీకర్ రహీం భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అందివచ్చిన బంతులను బౌండరీలకు పంపుతూ కొరకరాని కొయ్యగా మారాడు. రహీంకు జతగా వికెట్ కీపర్ లిటన్‌దాస్ కూడా ఆచితూచి ఆడడంతో భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే అశ్విన్ వేసిన 40వ ఓవర్‌లో రెండో బంతికి లిటన్‌దాస్ (35) అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్‌కు 63 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మెహిడీ హసన్‌తో కలిసి రహీం తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ముందు నెమ్మదిగా ఆడిన హసన్ ఆ తర్వాత బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను ఉమేశ్ యాదవ్ విడగొట్టాడు. ఉమేశ్ వేసిన అద్భుత బంతికి మెహిడీ హసన్ (38) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక తర్వాత వచ్చిన తైజుల్ ఇస్లాం (6), ముష్ఫీకర్ రహీం (64), ఎబదత్ హుస్సేన్ (1)ను షమీ, అశ్విన్ అవుట్ చేయడంతో 213 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లు తీసుకోగా, రవిచంద్రన్ అశ్విన్ 3, ఉమేశ్‌యాదవ్ 2, ఇషాంత్ శర్మ 1 వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో ముందుంది. ఇరు జట్లు మధ్య రెండో టెస్టు ఈనెల 22నుంచి 26 వరకు ఈడేన్‌గార్డెన్స్ మైదానంలో జరగనుంది. ఈ డే, నైట్ టెస్టు భారత్-బంగ్లా జట్లకు మొదటిది కానుంది.
*
టీమిండియా కెప్టెన్లలో అత్యధిక ఇన్నింగ్స్ విజయాలను అందుకున్న కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సరికొత్త ఘనత అందుకున్నాడు. విరాట్ కెప్టెన్సీలో మొత్తం 10 సార్లు ఇన్నింగ్స్ విజయాల్ని అందుకోగా, ఎమ్మెస్ ధోనీ (9), మహ్మద్ అజారుద్దీన్ (8), సౌరవ్ గంగూలీ (7) సార్లు కోహ్లీ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
*
గత ఆరు టెస్టుల్లో బంగ్లాదేశ్ జట్టు అన్నింట్లో పరాజయం చవిచూడగా,
ఐదింట్లో ఇన్నింగ్స్ ఓటమిని ఎదుర్కొంది.
*
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో 7 వికెట్లను పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులిచ్చి 4 నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దీంతో షమీ స్వదేశంలో మూడో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఇదే ఏడాది విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 35 పరుగులిచ్చి 5 వికెట్లను తీశాడు.
*
ఒకే ఏడాది 100 పరుగులకు పైగా ఇన్నింగ్స్ విజయాలను అందుకోవడం భారత జట్టుకు ఇది మూడోసారి. గత టెస్టుల్లో పుణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగి మొదటి టెస్ట్ మ్యాచ్‌లో 137 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో గెలవగా, అదే జట్టుతో రాంచీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 202 పరుగులతో విజయం సాధించింది.
తాజాగా ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత్ 130 పరుగులతో విజయం సాధించింది.
స్కోర్ బోర్డు..
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్: 150 ఆలౌట్
భారత్ మొదటి ఇన్నింగ్స్: 493/6
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: షద్మాన్ ఇస్లాం (బీ) ఇషాంత్ 6, ఇమ్రూల్ కైస్ (బీ) ఉమేశ్ 6, మోమినుల్ హక్(ఎల్‌బీడబ్ల్యూ) (బీ) షమీ 7, మహ్మద్ మిథున్ (సీ) మయాంక్ అగర్వాల్ (బీ) షమీ 18, ముష్ఫీకర్ రహీం (సీ) పుజారా (బీ) అశ్విన్ 64, మహ్మదుల్లా (సీ) రోహిత్ (బీ) షమీ 15, లిటన్ దాస్ (సీ) (బీ) అశ్విన్ 35, మెహిడీ హసన్ (బీ) ఉమేశ్ 38, తైజుల్ ఇస్లాం (సీ) సాహా (బీ) షమీ 6, అబూ జాయేద్ (నాటౌట్) 4, ఎబదత్ హుస్సేన్ (సీ) ఉమేశ్ (బీ) అశ్విన్ 1.
ఎక్స్‌ట్రాలు: 213 మొత్తం: 213 (69.2 ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-10, 2-16, 3-37, 4-44, 5-72, 6-135, 7-194, 8-208, 9-209, 10-213.
బౌలింగ్ : ఇషాంత్ శర్మ 11-3-31-1, ఉమేశ్ యాదవ్ 14-1-51-2, మహ్మద్ షమీ 16-7-31-4, రవీంద్ర జడేజా 14-2-47-0, రవిచంద్రన్ అశ్విన్ 14.2-6-42-3.