క్రీడాభూమి

టెస్టు ర్యాంకింగ్స్‌లో షమీ, మాయాంక్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆదివారం ప్రకటించిన ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, ఓపెనర్ మాయాంక్ అగర్వాల్ దూకుడును కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ తమతమ కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకింగ్స్‌ను అందుకున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 27 పరుగులకు 3, రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన షమీ ఎనిమిద స్థానాలను మెరుగుపరచుకొని, ఏడో స్థానాన్ని ఆక్రమించాడు. భారత బౌలర్లలో ఇప్పటి వరకూ సాధించిన అత్యధిక పాయింట్ల జాబితాలో అతను మూడో స్థానాన్ని ఆక్రమించాడు. కపిల్ దేవ్ 877 పాయింట్లతో నంబర్ వన్‌గా నిలవగా, ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న బుమ్రా 832 పాయింట్లు సంపాదించాడు. షమీ ఖాతాలో 790 పాయింట్లు చేరాయి. ఇలావుంటే, బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో, ఒక ఇన్నింగ్స్‌లో మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్న మాయాంక్ 243 పరుగులు చేసి, ర్యాంకింగ్స్‌లో 11వ స్థానాన్ని ఆక్రమించాడు. కాగా, బౌలింగ్ విభాగంలో పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), కాగిసో రబదా (దక్షిణాఫ్రికా), జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు.
బ్యాటింగ్ విభాగంలో ఆసీస్ స్టార్ స్టీవెన్ స్మిత్ నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అతను 937 పాయింట్లతో ఈ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 912 పాయింట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్) మూడో స్థానంలో ఉన్నాడు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్
‘టాప్-10’ జట్లు
1. భారత్ (119 పాయింట్లు), 2. న్యూజిలాండ్ (109 పాయింట్లు), 3. ఇంగ్లాండ్ (104 పాయింట్లు), 4. దక్షిణాఫ్రికా (102 పాయింట్లు), 5. ఆస్ట్రేలియా (99 పాయింట్లు), 6. శ్రీలంక (95 పాయింట్లు), 7. పాకిస్తాన్ (84 పాయింట్లు), 8. వెస్టిండీస్ (80 పాయింట్లు), 9. బంగ్లాదేశ్ (61 పాయింట్లు), 10. అఫ్గానిస్తాన్ 955 పాయింట్లు).
* టెస్టు హోదా ఉన్న మరో రెండు జట్లలో జింబాబ్వే 16 పాయింట్లు సంపాదించగా, ఐర్లాండ్ ఇంకా పాయింట్ల ఖాతాను తెరవలేదు.
‘టాప్-10’ బ్యాట్స్‌మెన్
1. స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా/ 937 పాయింట్లు), 2. విరాట్ కోహ్లీ (్భరత్/ 912 పాయింట్లు), 3. కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్/ 878 పాయింట్లు), 4. చటేశ్వర్ పుజారా (్భరత్/ 790 పాయింట్లు), 5. అజింక్య రహానే (్భరత్/ 759 పాయింట్లు), 6. హెన్రీ నికోల్స్ (న్యూజిలాండ్/ 749 పాయింట్లు), 7. జో రూట్ (ఇంగ్లాండ్/ 749 పాయింట్లు), 8. టామ్ లాథమ్ (న్యూజిలాండ్/ 724 పాయింట్లు), 9. తిముత్ కరుణరత్నే (శ్రీలంక/ 723 పాయింట్లు), 10. రోహిత్ శర్మ (్భరత్/ 701 పాయింట్లు).
‘టాప్-10’ బౌలర్లు
1. పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా/ 908 పాయింట్లు), 2. కాగిసో రబదా (835 పాయింట్లు), 3. జాసన్ హోల్డర్ (వెస్టిండీస్/ 814 పాయింట్లు), 4. జస్‌ప్రీత్ బుమ్రా (్భరత్/ 802 పాయింట్లు), 5. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్/ 798 పాయింట్లు), 6. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్/ 795 పాయింట్లు), 7. మహమ్మద్ షమీ (్భరత్/ 790 పాయింట్లు), 8. నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్/ 785 పాయింట్లు), 9. వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా/ 783 పాయింట్లు), 10. రవిచంద్రన్ అశ్విన్ (్భరత్/ 780 పాయింట్లు).
టాప్-10 బ్యాట్స్‌మెన్‌లో నలుగురు, బౌలర్లలో ముగ్గురు భారత క్రికెటర్లు కావడం విశేషం. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఆసీస్‌దే పైచేయ.

*చిత్రాలు.. మహమ్మద్ షమీ
*మాయాంక్ అగర్వాల్