క్రీడాభూమి

అందరి చూపు.. ఈడెన్‌గార్డెన్స్ వైపే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరిగనున్న చారిత్రాత్మక పింక్ బాల్ (డే నైట్) టెస్టు అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఈనెల 22 నుంచి జరిగే ఈ టెస్టు కోసం ఇప్ప టికే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటి డే నైట్ మ్యాచ్‌లకు విముఖత వ్యక్తం చేసిన టీమిండియా, మొదటిసారి బంగ్లాదేశ్‌తో కలిసి ఆడనుంది. దీంతో దీనిపై ప్రపంచ క్రికెట్ సైతం ఈ టెస్టుపై ఆసక్తిగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయతే బంగ్లాదేశ్ జట్టుకు సైతం ఇదే తొలి డే నైట్ టెస్టు కావడం విశేషం. మాజీ కెప్టెన్, క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)తో మాట్లాడి సొంత గడ్డపై ఈ చారిత్రాత్మక టెస్టును నిర్వహిం చడంలో సఫలమయ్యాడనే చెప్పాలి. అందుకు తగ్గట్లు దగ్గరుండి మరీ ఈడెన్‌గార్డెన్స్‌కు మెరుగులు దిద్దించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులకు వేదికైన ఈడెన్‌గార్డెన్స్ డే నైట్ టెస్టుతో మరోసారి చరిత్రలో నిలవనుంది.
నాలుగు రోజుల టికెట్లు..
అంతా బాగానే ఉన్నా డే నైట్ టెస్టుకు అభిమానులు సహకరిస్తారా? లేదా అనే ఆలోచన బీసీసీఐని కొంచెం కలవ రపెట్టినా, దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ విజయవంతమైంది. ఇప్పటికే నాలుగు రోజులకు సంబంధించిన టికెట్లు అమ్ముడు పోయనట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన ట్విటర్ ద్వారా హర్షం వ్యక్తం చేశాడు. అయతే ఆన్‌లైన్‌లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోగా, ఆఫ్ లైన్ టిక్కెట్ల కోసం అభిమానులు ఈడెన్‌గార్డెన్స్‌కు పోటెత్తుతు న్నారు.
ప్రముఖులు, మాజీలు రాక..
భారత్‌లో జరిగే పింక్ బాల్ టెస్టుకు క్యాబ్ ప్రముఖులతో పాటు మాజీ క్రికెటర్లు, అథ్లెట్లను ఆహ్వానించింది. ఈ టెస్టుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు లెజెండరీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు సీనియర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. వీరితో పాటు భారత అథ్లెట్లు కూడా మొదటిరోజు మ్యాచ్‌ను తిలకించనున్నారు.
పారా ట్రూపర్లతో..
పింక్ బాల్ టెస్టు చరిత్రలో నిలిచిపోయేలా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వినూత్నంగా అడుగులు వేసింది. ఈ టెస్టు రెండోరోజు భారత ఆర్మీకి చెందిన పారా ట్రూపర్లు గాలిలో ఎగురుతూ ఇరు జట్ల కెప్టెన్లకు పింక్ బాల్‌ను అందేలా ఏర్పాట్లు చేసినట్లు క్యాబ్ కార్యదర్శి అభిషేక్ దాల్మియా పేర్కొన్న విషయం తెలిసిందే. 2001లో ఆస్ట్రేలియాతో ఇదే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 171 పరుగుల విజ యాన్ని సాధించింది. దీని జ్ఞాపకంగా మూడో రోజు అప్పటి ఆటగాళ్లయనా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్‌ను సన్మానించనుంది. వీరితో పాటు అభినవ్ బింద్రా, మేరీకోమ్‌తో పాటు పలువురి అథ్లెట్లను సన్మానించనుంది.
కోల్‌కతాకు చేరుకున్న ఆటగాళ్లు..
రెండే (డే నైట్) టెస్టు కోసం మంగళవారం ఇరు జట్ల ఆటగాళ్లు రాజ్‌కోట్ నుంచి కోల్‌కతాకు చేరుకున్నారు. వీరికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఇదిలాఉంటే పింక్ బాల్ టెస్టు కోసం భారత్-బంగ్లా జట్లు మైదానంలో తీవ్రంగానే శ్రమిం చాయ. బంగ్లాదేశ్ అయతే బంతిని నీటిలో తడిపి ప్రాక్టీస్ చేసింది. రాత్రి మ్యాచ్ కావడంతో బంతి స్వింగ్ అయ్యే అవకాశం ఉండడంతో ఇలా ప్రాక్టీస్ చేసినట్లు ఆటగాళ్లు పేర్కొన్నారు. ఇక స్పిన్నర్లయతే బంతిని నీటిలో ముంచి కంకర రాళ్లపై ప్రాక్టీస్ చేశారు. భారత ఆటగాళ్లు సైతం రాజ్‌కోట్‌లోనే నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు.
*చిత్రాలు.. కోల్‌కతాలో జరిగే మొదటి డే, నైట్ టెస్టు కోసం బెలూన్లను ఏర్పాటు చేసిన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్)
*విద్యుద్దీపకాంతుల్లో ఈడెన్ గార్డెన్స్ మైదానం