క్రీడాభూమి

పింక్ బాల్..మనోళ్లకూ పాతదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 20: పింక్ బాల్.. ఇప్పుడు దేశమంతా ఇదే పేరు జపిస్తోంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు (డే, నైట్) కోసం క్రికెట్ ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రపంచ నెంబర్ వన్‌గా అవతరించిన భారత్ డే నైట్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. అయతే పింక్ బాల్ భారత్‌కు కొత్తేమీ కాదు. 2016లోనే దేశ వాళీ టోర్నమెంట్ అయన దులీఫ్ ట్రోఫీలో ఈ బంతితో చాలా మ్యాచ్‌లో ఆడింది. అయతే ఇందులో భారత్ కు కలిసొచ్చే అంశమేంటంటే అప్పటి దేశవాళి టోర్నీల్లో పాల్గొన్న ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో ఉండడం విశేషం. కానీ అంతర్జాతీయ స్థాయ లో పింక్‌బాల్, డే నైట్ టెస్టులు మాత్రం టీమిండియా ఆడడం మాత్రం ఇదే మొదటిసారి.
అధికారికంగా 2015లోనే...
టెస్టు క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అనుమతితో పింక్‌బాల్ (డే నైట్) టెస్టును మొదటిసారి ఆడిలైడ్ వేదికగా 2015లో ఆస్ట్రేలియా-న్యూజిల్యాండ్ జట్లు ఆడి, సరికొత్త క్రికెట్‌కు శ్రీకా రం చుట్టాయ. సొంతగడ్డపై జరిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి, మొదటి డే, నైట్ టెస్టు విజేతగా అవతరించింది. ఆ తర్వాత ఇంగ్లాండ్, పాకిస్తా న్, శ్రీలంక, వెస్టిండీస్ వంటి జట్లు కూడా డే నైట్ టెస్టులాడా య. అయతే అప్పుడు ఈ తరహా మ్యాచ్‌లను తీవ్రంగా వ్యతిరేకించిన టీమిండియా, ఈ నెల 22న మొదటిసారి డే నైట్ క్రికెట్ ఆడబోతుంది. అయతే పింక్ బాల్ క్రికెట్‌తో భార త క్రికెటర్లకూ అనుభవముంది. 2016 నుంచి భారత్ దేశవాళీ టోర్నీ అయన దులీప్ ట్రోఫీలో పింక్ బంతులనే వాడారు.
ఎవరికెంత అనుభవం?
ప్రస్తుత భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) నిర్వహించిన క్యాబ్ సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో పింక్ బంతితో ఆడిన అనుభవముంది. మొత్తం రెండు ఇన్నింగ్స్‌లాడిన సాహా మొదటి ఇన్నింగ్స్‌ంలో 33, రెండో ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయకుండానే వెనుదిరి గాడు. అయతే ప్రస్తుత మ్యాచ్ తన సొంత గడ్డపై జరుగుతుం డడం సాహాకు కలిసొచ్చే అంశమే. ఇక 2016 దులీప్ ట్రోఫీలో భాగంగా రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, మయాంక్ అగర్వాల్, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, హనుమ విహారి, రిషభ్ పంత్‌లకు పింక్ బాల్‌తో క్రికెట్ ఆడిన అనుభ వం ఉంది. 2016లో దులీప్ ట్రోఫీలో జడేజా రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. చటేశ్వర్ పుజారా అయతే ఆడిన ఒకే ఒక మ్యాచ్‌లో 256 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ 11 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. హనుమ విహారి సెంచరీ, రిషభ్ పంత్ అర్ధ సెంచరీలతో రాణించారు. ఇక యువ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ ఏకంగా ఐదు ఇన్నింగ్స్‌లు ఆడి 419 పరుగులు చేశాడు. వీరందరికీ ఈ అనుభవం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఉపయోగపడనుంది.
పింక్ బాల్ (డే నైట్) టెస్టు గురించి మరిన్ని..
2015 నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది.
ఇప్పటివరకు ఆస్ట్రేలియా మొత్తం 5 డే నైట్ మ్యాచ్‌లా డగా, అన్నింట్లో విజయం సాధించింది.
న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌లాడగా, ఒక మ్యాచ్‌లో ఓడి, మరో మ్యాచ్‌లో విజయం సాధించింది.
డే నైట్ టెస్టులాడిన జట్లలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో పాటు ఇంగ్లాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక జట్లున్నాయ.
వీటిలో వెస్టిండీస్ మినహా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్ ఒక్కో టెస్టులో విజయం సాధించాయ.
ఈ ఫార్మాట్ టెస్టులో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అజార్ అలీ మొత్తం 6 ఇన్నింగ్స్‌ల్లో 71 సగటుతో 456 పరుగులు సాధించి టాప్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో నాలుగు టెస్టులాడిన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ 50.62 సగటుతో 405 పరుగులు సాధించాడు.
ఈ డే నైట్ టెస్టులో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అజార్ అలీ వెస్టిండీస్‌పై త్రిపుల్ సెంచరీ (302) పరుగులు చేసి, అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
అలాగే పాకిస్తాన్‌కే చెదిన అసద్ షాఫిఖ్ రెండు సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా ఘనత సాధించాడు.
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ 5 టెస్టులాడి 23 సగటుతో 26 వికెట్లు తీశాడు. ఆందులో ఒకసారి 5 వికెట్లను పడగొట్టాడు.
ఆస్ట్రేలియాకే చెందిన జోష్ హజెల్‌వుడ్ 22.42 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు.
ఇక అత్యుత్తమ గణాంకాలు సాధించిన బౌలర్‌గా దేవేం ద్ర బిషూ (వెస్టిండీస్) నిలిచాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్‌లో 13.5 ఓవర్లు వేసి 49 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు.

*చిత్రాలు..నెట్ ప్రాక్టీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ , టీమిండియా ఆటగాళ్లు