క్రీడాభూమి

వాతావరణ పరిస్థితుల్లో కుదురుకోలేక పోయాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడిలైడ్, డిసెంబర్ 2: ఆస్ట్రేలియాలోని వాతావరణ పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరగా కుదురుకోవడంతోబాటు బ్యాట్స్‌మన్ మంచి భాగస్వామ్యాలను సాధించడం పాకిస్తాన్‌కు ప్రస్తుతం అత్యంత కీలకమని ఆ జట్టు సారధి అజహర్ అలీ సోమవారం నాడిక్కడ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌కు అత్యంత బాధాకరమైన టెస్టు రికార్డు ఉందని, దానిని అధిగమిస్తామన్న విశ్వాసం తమకుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఈ జట్టు ఇటీవల అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
అంతకు ముందు బ్రిస్‌బేన్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ను సైతం ఇన్నింగ్స్ 5 పరుగుల భారీ తేడాతో కోల్పోయిన పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ప్రత్యేకించి ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన గత 14 వరుస టెస్టు మ్యాచుల్లో పాకిస్తాన్ పరాజయం పాలై దారుణమైన రికార్డును సంతరించుకుంది. ఈక్రమంలో మాట్లాడిన అజహర్ అలీ పరిస్థితులను అధిగమించి విజయాలు సాధిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ప్రధానంగా విదేశీ కండిషన్స్‌కు యువ క్రీడాకారులు అత్యంత వేగంగా అలవాటుపడాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ బ్యాటింగ్ కండిషన్స్ ఆస్ట్రేలియాలోనే ఉన్నాయని, బంతి బౌన్స్ అయ్యేతీరుకు అనుగుణంగా బ్యాట్స్‌మెన్ ఫుట్‌వర్క్ ఇతర కదలికలు ఉంటే పరుగుల వరద పారించవచ్చన్నాడు. ఇందుకోసం జట్టు మొత్తం సమష్టిగా కృషి చేయాల్సివుందని, ప్రత్యేకించి మంచి భాగస్వామ్య స్కోర్లు సాధించడం ముఖ్యమని తెలిపాడు. ఆస్ట్రేలియా కండిషన్స్‌లో టెస్టు మ్యాచ్‌లో 20 వికెట్లు పడగొట్టడం కూడా కీలకమైన అంశమని, బౌలర్లు ఇందుకోసం విశేషంగా శ్రమించాల్సివుందని అన్నాడు. ఈ విషయంలో ఈ పర్యటనలో పాకిస్తాన్ కొంత సత్ఫలితాన్ని పొందగిలిగిందని, అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్ తన పూర్వపు ఆట తీరును సంతరించుకున్నాడని, బ్రిస్బేన్‌లో సెంచరీ చేయడం, అడిలైడ్‌లో 97 పరుగులు సాధించడమే ఇందుకు నిదర్శనమని అజహర్ అలీ గుర్తు చేశాడు. స్పిన్ బౌలర్ యాసిర్ షా సైతం ఆల్ రౌండర్‌గా మంచి ప్రతిభ చూపుతున్నాడని, మేడిన్ టెస్టు సెంచరీ సాధించాడని కొనియాడాడు. ఐతే జట్టులో అనుభవ రాహిత్యం వేధిస్తోందని, యువ ఫాస్ట్‌బౌలర్లను దీటుగా ఎదుర్కొని అడిలైడ్‌లో డేవిడ్ వార్నర్ 335 పరుగుల భారీ స్కోరును సాధించగలిగాడన్నాడు. ఈ పర్యటనలో చేదు అనుభవం ఎదురైనప్పటికీ అనుకూలాంశాలను పరిగణనలోకి తీసుకుని జట్టు సామర్ధ్యాన్ని పెంచుకుని ముందుకు సాగుతామన్నాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతోబాటు మంచి ఫీల్డింగ్ తీరును ప్రదర్శించే విధంగా తమ ఆటగాళ్లను అప్రమత్తం చేస్తున్నామన్నాడు. ప్రధానంగా యువ బౌలర్లకు ఇది గడ్డుకాలంగా ఉందన్నాడు. తాము ఎన్నో అంచనాలతో ఇక్కడికి వచ్చినప్పటికీ వాటిని సాధించడంలో వైఫల్యం చెందడం బాధాకరమని అజహర్ అలీ అన్నాడు.