క్రీడాభూమి

చివరి, రెండో టెస్టు డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్: కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, రాస్ టేలర్ శతకాలు సాధించగా, ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టును డ్రాగా ముగించిన న్యూజిలాండ్ సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్ డ్రా అయ్యే సమయానికి విలియమ్‌సన్ 104, టేలర్ 105 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. టెస్టుల్లో విలియమ్‌సన్ 21, టేలర్‌కు 19వ సెంచరీ నమోదు చేశారు. రెండు వికెట్లకు 96 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజున ఆటను కొనసాంచిన కివీస్ మరో వికెట్ కోల్పోకుండా 241 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఈ జట్టు 129 ఓవర్లలో 375 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 162.5 ఓవర్లు ఆడి 476 పరుగుల భారీ స్కోరు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు వెనుకబడిన న్యూజిలాండ్ నాలుగో రోజున రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, ఒకానొక దశలో 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. దీనితో, మ్యాచ్‌పై ఇంగ్లాండ్ పైచేయి సాధించినట్టు కనిపించింది. అయితే, విలియమ్‌సన్, టేలర్ జట్టును ఆదుకొని, మ్యాచ్‌ని డ్రాగా ముగించారు. మొదటి టెస్టును గెల్చుకున్న కివీస్ ఈ సిరీస్‌ను 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 129 ఓవర్లలో 375 ఆలౌట్ (టామ్ లాథమ్ 105, రాస్ టేలర్ 53, వాల్టింగ్ 55, డెరిల్ మిచెల్ 73, స్టువర్ట్ బ్రాడ్ 4/73, క్రిస్ వోక్స్ 3/83, శామ్ క్యూరెన్ 2/63).
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 162.5 ఓవర్లలో 476 ఆలౌట్ (రొరీ బర్న్స్ 104, జో రూట్ 226, ఒలీ పోప్ 75, నీల్ వాగ్నర్ 5.124, టిమ్ సౌథీ 2/90).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 2 వికెట్లకు 96): టామ్ లాథమ్ సీ జో రూట్ బీ క్రిస్ వోక్స్ 18, జీత్ రావెల్ ఎల్‌బీ శామ్ క్యూరెన్ 0, కేన్ విలియమ్‌సన్ 104 నాటౌట్, రాస్ టేలర్ 105 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (75 ఓవర్లలో 2 వికెట్లకు) 241.
*చిత్రం...ఇంగ్లాండ్‌పై రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న న్యూజిలాండ్ జట్టు