క్రీడాభూమి

తమిళనాడు రంజీ జట్టు కెప్టెన్‌గా విజయ్ శంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 4: ఈనెల 9 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడే తమిళనాడు జట్టుకు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నాయకత్వం వహించనున్నాడు. తమిళనాడు క్రికెట్ సంఘం (టీన్‌సీఏ) మంగళవారం ఎంపిక చేసిన జట్టులో టెస్టు స్టార్ రవిచంద్రన్ అశ్విన్, ఇటీవల కాలంలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించలేకపోతున్న మురళీ విజయ్‌కి కూడా చోటు లభించింది. ఈ టోర్నీలో తమిళనాడు తన మొదటి రెండు మ్యాచ్‌లను కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌తో ఆడుతుంది.
జట్టు వివరాలు: విజయ్ శంకర్ (కెప్టెన్), బీ. అపరాజిత్ (వైస్ కెప్టెన్), మురళీ విజయ్, అభినవ్ ముకుంద్, దినేష్ కార్తీక్, జగదీశన్, రవిచంద్రన్ అశ్విన్, సాయి కిషోర్, నటరాజన్, విగ్నేష్, అభిషేక్ తన్వర్, ఎం. అశ్విన్, సిద్ధార్థ్, షారుఖ్ ఖాన్, ముఖేష్.