క్రీడాభూమి

రష్యా అంశమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసనే్న, నవంబర్ 4: ప్రభుత్వమే వ్యూహాత్మక డోపింగ్‌ను ప్రోత్సహిస్తున్నదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రష్యా అంశమే ఇక్కడ ప్రారంభమైన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కార్యవర్గ సమావేశంలో కీలక అంశం కానుంది. రష్యా అథ్లెట్లు ఉద్దేశపూర్వకంగానే నిషిద్ధ ఉత్రేరకాలు వాడుతున్నారని, వారిని అక్కడి ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నదని చాలాకాలంగా విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే అనేక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్స్‌లో రష్యాపై నిషేధం వేటు పడింది. ఆ దేశానికి చెందిన అథ్లెట్లు ఆయా క్రీడల అంతర్జాతీయ సమాఖ్యల పతకాల కింద పోటీ చేయాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఒలింపిక్ క్రీడలు జరగనున్న నేపథ్యంలో, రష్యా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సోమవారం నుంచి ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) కార్యవర్గ సమావేశం జరగనున్న తరుణంలో, ఐఓసీ తీసుకోబోయే నిర్ణయాలు ఆసక్తిని రేపుతున్నాయి. వచ్చే ఒలింపిక్స్ నుంచి రష్యాను సస్పెండ్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నందున, ఐఓసీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
పారిస్ నుంచి లాసనే్నకు..
వచ్చే వారం ప్రారంభంలో జరిగే వాడా అత్యంత కీలకమైన ఎక్స్‌కో సమావేశాన్ని పారిస్ నుంచి లాసనే్నకు మార్చారు. ఫ్రెంచ్ రాజధానిలో సార్వత్రిక సమ్మె జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాడా ప్రకటించింది. ఐఓసీ ఆమోదించబోయే తీర్మానాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చర్చలు జరుపుతామని వాడా తన ప్రకటనలో తెలిపింది. అయితే, రష్యా అంశమే ఇక్కడ కూడా ప్రధానంగా చర్చకు వస్తుందని అంటున్నారు. డోపింగ్ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, దానిని కూకటివేళ్లతో పెకళించడమే తమ లక్ష్యమని తేల్చిచెప్పింది. డోపింగ్‌ను ఉపేక్షించేది లేదం టూ రష్యాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది.