క్రీడాభూమి

టీమిండియా ముమ్మర ప్రాక్టీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగే మొదటి టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ముమ్మర ప్రాక్టీస్ చేసింది. బుధవారం ఉదయం రొటీన్ ఎక్సర్సైజ్‌తో మొదలు పెట్టిన ఆటగాళ్ళు ఆ తర్వాత నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. భారత్‌తో వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ఆడుతుంది. రెండో మ్యాచ్ తిరువనంతపురంలో 8న, చివరిదైన మూడో మ్యాచ్ 11న ముంబయిలో జరుగుతాయి. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్-డే ఇంటర్నేషనల్ సిరీస్‌లోనూ విండీస్ ఆడుతుంది.
సవాళ్లను స్వీకరిస్తా: సుందర్
వాతావరణం లేదా పిచ్ స్వభావం ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకూ ప్రత్యర్థులను కట్టడి చేయడానికే ప్రాధాన్యతనిస్తానని భారత యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అన్నాడు. ఎలాంటి సవాళ్ళనైనా స్వీకరిస్తానని ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పాడు. పవర్ ప్లే స్పెషలిస్టుగా ముద్రపడడం తన బాధ్యతలను మరింతగా పెంచుతున్నదని వ్యాఖ్యానించాడు. వివిధ రకాలైన పిచ్‌లపై బౌలింగ్ చేయడం నిజమైన సవాళ్ళను అన్నాడు. వికెట్ తీరు ఏ విధంగా ఉన్నప్పటికీ నిలకడగా బౌలింగ్ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పాడు. ఎడమ చేతి బ్యాట్స్‌మెన్‌కు ఆఫ్ స్పిన్‌తో పెద్దగా ఇబ్బందులు ఉండవన్న వాదనను సుందర్ తోసిపుచ్చాడు. సమర్థుడైన బ్యాట్స్‌మెన్ ఎలాంటి బౌలింగ్‌నైనా సులభంగానే ఎదుర్కొంటాడని అన్నాడు. అందుకే సాధ్యమైనంత వరకూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంపైనే తాను దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పాడు. గత ఏడాది గాయం కారణంగానే జాతీయ జట్టుకు దూరమైన తాను మళ్లీ జట్టులోకి రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాడు. వెస్టిండీస్‌లో జరిగే టీ-20 సీరిస్‌లో భారత్ విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
*చిత్రం... ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో వెస్టిండీస్ టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌కి సిద్ధమవుతూ,
బుధవారం రొటీన్ వామప్‌లో నిమగ్నమైన టీమిండియా సభ్యులు