క్రీడాభూమి

తాడోపేడో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు భారత్, వెస్టిండీస్ జట్లు వాంఖడే వేది కగా చివరి మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు చెరో టీ20 మ్యాచ్‌ను గెలుచుకోగా, నిర్ణయాత్మక మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో.
ఫీల్డింగ్ లోపమే కారణమా?
రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ పరాజయానికి ఫీల్డింగే కారణమని క్రికెట్ విశే్లషకులతో పాటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే మాదిరి ఫీల్డింగ్ చేస్తే ఎన్ని పరుగులు చేసినా ఓటమి తప్పదని టీమిండి యా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్న విషయం తెలిసిందే. గత మ్యాచ్ లో చేసిన తప్పులను పునరావృతం కానివ్వొద్దని సహచర ఆటగాళ్లను హెచ్చరిం చాడు. మరోవైపు బ్యాటింగ్‌లో నూ ఎవ రో ఒకరిపై ఆధార పడాల్సి వస్తుంది. మొదటి మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో గట్టెక్కగా, ఆ తర్వాతి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మినహా టాప్ ఆర్డర్ అంతా విఫలమైంది. చివరి ఓవర్లలోనూ పరుగులు రాబట్టేందుకు బ్యాట్స్‌మెన్లు చా లా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ రెండు మ్యాచు ల్లోనూ (8,15) రాణించలేక పోయాడు. అయితే చివరి మ్యాచులో రోహిత్ రాణిస్తే భారత్ బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా మారే అవకాశం ఉంటుంది.
సంజూ పరిస్థితేంటి?
యువ ఆటగాడు సంజూ శాంసన్ పరిస్థితి ఎటు తేలకుండా ఉంది. 2015లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సంజూ ఇటీవల జరిగిన సిరీస్‌లకు ఎంపికైనా తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేక పోతున్నాడు. ఒకవేళ సంజూకు అవకాశ మిస్తే జట్టులో నుంచి ఎవరిని రిజర్వ్ బెంచ్‌కు పరిమితం చేయాల నే దానిపై ఇటు సెలక్టర్లు, అటు కెప్టెన్ తేల్చు కోలేకపోతున్నాడు. అయతే తరుచూ ఒకే తరహా పెవిలియన్‌కు చేరుతున్నా రిషభ్‌పంత్‌ను కెప్టెన్ కోహ్లీ వెనుకేసుకు రావడంతో సంజూ పరిస్థితి క్లిష్టంగా మారింది. అయతే శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సంజూను బరిలోకి దింపినా నాలుగో స్థానానికి శ్రేయాస్ అయితేనే సరిపోతాడని జట్టు భావిస్తోంది. దీంతో తు ది జట్టులో సంజూకు చోటు దక్కుతుందో లేదో అనేది అను మానంగానే ఉంది. ఇప్పటికే జట్టులో ఈ యువ ఆటగాడికి చో టు కల్పించాల ని కేరళలో అభిమానులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే.
ధీమాగా కరే బియన్లు..
రెండో టీ20లో 171 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విండీస్ జట్టు నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌లో ధీమాగా కనిపిస్తోంది. జట్టు లో కెప్టెన్ కీరన్ పొలార్డ్ సహా టాప్ ఆర్డర్ అంతా హార్డ్ హిట్టర్లు కావడం, అంతా ఆటగాళ్లే కావడంతో విండీస్ జట్టు సిరీస్ సాధిం చాలనే పట్టుదలతో కనిపిస్తోంది. వాంఖడే పిచ్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్‌కు సహకరించనుండడంతో టాస్ గెలిచిన కెప్టెన్లు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
*చిత్రాలు.. విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్
*నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా ఆటగాళ్లు