క్రీడాభూమి

తక్కువ శిక్షే పడుతుందేమో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: డోపింగ్ పరీక్షలో దొరికిపోయన తనకు నాడా తక్కువ శిక్షే విధిస్తుందేమోనని షూటర్ రవికుమార్ (29) పేర్కొ న్నాడు. తను మైగ్రేన్‌కు వైద్యం కోసం మందులు తీసుకున్నానని, అయ తే తాను వాడిన మందుల్లో నిషేధిత ఉత్ప్రేరకం ఉందన్న విషయం తెలియదన్నాడు. మే, జూన్‌లో కుమార్ సురేంద్రనాథ్ స్మారక పోటీలకు ముందుగానే వైద్యుడి సూచన మేరకు ఆ మందులను వాడినట్లు పేర్కొన్నాడు. జరిగిన ప్రతి విషయాన్ని నాడాకు వివరించానని చెప్పాడు. అయతే నాడా పరీక్షకు ముందు ఈ విషయం చెప్పకపోవడమే తన తప్పని అంగీకరించాడు. తెలియక తీసుకోవడంతో నాకు అనుకూలంగా నే తీర్పు ఉంటుందని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒలింపిక్స్‌లో ఆడేందుకు నాలుగేళ్లు పడిన కష్టం వృథా అయందని ఆవేదన వ్యక్తం చేశాడు. మేలో మ్యూనిచ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ లో 10 మీటర్ల ఎయర్ రైఫిల్ షూటింగ్‌లో రవికుమార్ పతకం సాధించాడు. గోల్డ్ కోస్ట్ కామనె్వల్త్ క్రీడల్లోనూ కాంస్యం అందుకున్నా డు. ఓ దేశవాళి పోటీకి ముం దు పరీక్షించిన రవికుమార్ నమూనాల్లో వాడా నిషేధిత ప్రొప్ర నొలాల్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే.