క్రీడాభూమి

అబిద్ రికార్డు సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావల్పిండి: పాకిస్తాన్ ఓపెనర్ అబిద్ అలీ రికార్డు సెంచరీని నమోదు చేశాడు. ఆడిన తొలి టెస్టు, తొలి వనే్డ ఇంటర్నేషనల్స్‌లో సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. 32 ఏళ్ల అబిద్ శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్, చివరి రోజు ఆటలో అద్భుత ప్రతిభ కనబరిచాడు. 95 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లంక పేసర్ విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో ఓ బంతిని బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతిలో రెండు పరుగులు సంపాదించి, సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో దుబాయ్‌లో తొలి వనే్డ ఇంటర్నేషనల్ ఆడిన అతను 112 పరుగులు చేశాడు. 1971లో వనే్డ ఇంటర్నేషనల్స్ ఫార్మాట్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి కెరీర్ తొలి వనే్డలోనే శతకాన్ని నమోదు చేసిన 15వ బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. తాజాగా పాకిస్తాన్‌పై సెంచరీ చేసి, రెండు ఫార్మాట్స్‌లోనే తన అరంగేట్రం మ్యాచ్‌ల్లోనే సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర పుటల్లో చిరస్మరణీయ అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు. 1876లో మొదలైన టెస్టు ఫార్మాట్‌లో పాకిస్తాన్ తరఫున డెబ్యూట్ మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 11వ బ్యాట్స్‌మన్‌గా అబిత్ గుర్తింపు సంపాదించాడు.
*చిత్రం... పాకిస్తాన్ ఓపెనర్ అబిద్ అలీ