క్రీడాభూమి

వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ విజేతలు మొమొతా, యూఫెయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాంఘై: బీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ టూర్ ఫైనల్స్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల విభాగంలో కెన్టో మొమొతా (జపాన్), మహిళల విభాగంలో చెన్ యూఫెయ్ (చైనా) టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం నాటి టైటిల్ పోరులో మొమొతా 17-21, 21-17, 21-14 తేడాతో ఆంథోనీ సినిసుకా గిన్టింగ్ (ఇండోనేషియా)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో యూఫెయ్ 12-21, 21-12, 21-17 స్కోరుతో తైవాన్‌కు చెందిన తాయ్ జూ ఇంగ్‌పై విజయాన్ని నమోదు చేసింది. విజేతలిద్దరూ తమతమ ఫైనల్స్‌లో తొలి సెట్లను కోల్పోయి, ఆతర్వాత రెండు సెట్లను సొంతం చేసుకొని, విజేతలుగా నిలవడం విశేషం.
*చిత్రం... బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ విజేతలు మొమొతా, యూఫెయ్